ఆర్టీసీ బస్సులో ఉరేసుకున్న యువకుడు.. టికెట్ తీసుకుని!

ఏపీ ఆర్టీసీ బస్సులో దారుణం జరిగింది. తిరుపతి- శ్రీకాళహస్తి మార్గంలో వెళ్లే బస్సులో ఓ యువకుడు ఉరేసుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సివుంది.

author-image
By srinivas
New Update
rerere

ఏపీ ఆర్టీసీ బస్సులో దారుణం జరిగింది. తిరుపతి- శ్రీకాళహస్తి మార్గంలో వెళ్లే బస్సులో ఓ యువకుడు ఉరేసుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది. ఆదివారం ఉదయం మేర్లపాక స్టేజి వద్ద బస్సు ఎక్కిన అతను టికెట్ తీసుకుని వెనకాలకు వెళ్లి సీట్లో కూర్చున్నాడని కండక్టర్ తెలిపారు. అయితే అతడు కాసేపటికి ఈ దారుణానికి పాల్పడ్డట్లు ప్రయాణికులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: మహారాష్ట్ర సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆయనకే మొగ్గు!

 

దారంతో ఉరివేసుకొని..

ఈ మేరకు యువకుడు బస్సు ఎక్కినప్పుడు ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని డ్రైవర్, కండక్టర్ చెప్పారు. ఆర్టీసీ సర్వీసులో వెనకవైపుకు వెళ్లి తన వెంట ఉన్న దారంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. బస్సులో ఉన్న ప్రయాణికులంతా ముందు వైపున కూర్చుండడంతో ఎవరూ గమనించలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సివుంది. బస్సును రేణిగుంటకు పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఇది కూడా చదవండి: ఎట్టకేలకు బయటపడ్డ విజయ్ - రష్మిక సీక్రెట్ రిలేషన్.. ఒక్క ఫొటోతో క్లారిటీ

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు