/rtv/media/media_files/2025/02/19/Xt35Ph2wHV5cMvHps2Ez.jpg)
crime Photograph: (crime)
AP Incident: సమాజంలో రోజు రోజుకు ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఒక ఘటన మరువక ముందే మరొకటి వెలుగులోకి వస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురి పై పైశాచికాన్ని ప్రదర్శించాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి కన్నబిడ్డపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఆంద్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది.
Also Read: Chhaava Collections: హిందీలో 'ఛావా' కలెక్షన్ల జోరు.. 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్! ఎన్ని కోట్లంటే
ఛీ.. ఛీ.. కన్న కూతురిపై
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక పై ఆమె తండ్రి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే మంగళవారం స్కూల్ కి వెళ్లిన బాలిక డల్ గా కనిపించడంతో.. టీచర్ ఏమైందని అడిగారు. ఈ క్రమంలో బాలిక తండ్రి ఓ రాక్షసుడని బయటపడింది. బాలిక తల్లి 8 ఏళ్ల కిందట భర్తతో విభేదాల కారణంగా పుట్టింటికి వెళ్లింది. కాగా, 3 ఏళ్లుగా పెద్ద కుమారై తండ్రి వద్ద ఉంటుంది. ఈ క్రమంలోనే బాలిక తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. విషయం బయటపడడంతో బాలిక తండ్రి పై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది.
తిరుపతిలో మరో దారుణం
ఇది ఇలా ఉంటే.. తిరుపతిలోని శ్రీకాళహస్తిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి జిల్లాకు చెందిన హేమంత్ కుమార్ అనే యువకుడు పెద్దలను ఎదిరించి కడప జిల్లా రైల్వే కోడూరు చెందిన లక్ష్మీ ప్రియను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వాడితో గుడ్డిగా వెళ్లిన లక్ష్మీ ప్రియకు పెళ్ళైన కొన్ని రోజులకే టార్చర్ మొదలైంది. కట్నం కోసం హేమంత్ ప్రియను వేధించడం మొదలు పెట్టాడు.
అయితే తాజాగా మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్యపై దాడి చేశాడు హేమంత్. ఆ తర్వాత గాయపడిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి దారిలోనే ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం గుంటా తోపు వద్దకు తీసుకెళ్లి ఆమెను స్క్రూడ్రైవర్ తో పొడిచి ఆపై కత్తితో దాడి చేశాడు. ఇంతలోనే అటుగా వెళ్తున్న కొందరు విద్యార్థులు ఇది గమనించి ప్రియను కాపాడారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?