Chhaava Collections: విక్కీ కౌశల్ హీరోగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన హిస్టారికల్ డ్రామా 'ఛావా' భారీ విజయాన్ని అందుకుంది. గతనెల విడుదలైన ఈ చిత్రం హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లను నమోదు చేస్తోంది. తాజాగా హిందీలో మరో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ రూ.516.8 కోట్ల వసూళ్లతో హిందీలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'బాహుబలి-2' వసూళ్లను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,788కోట్లు కలెక్షన్స్ రాబట్టిన బాహుబలి హిందీలో రూ.510.99 కోట్లు వసూలు చేసింది.
ఇది కూడా చూడండి: Kartik Aaryan: కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?
తెలుగులో కూడా..
ఇది ఇలా ఉంటే ఇటీవలే విడుదలైన 'ఛావా' తెలుగు వెర్షన్ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగులో 4 రోజుల్లో రూ.10కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.మొత్తం 26 రోజుల థియేట్రికల్ రన్ ద్వారా 'ఛావా' ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?