అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు అర్థరాత్రి 2 గంటల సమీపంలో ప్రమాదానికి గురైంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామ సమీపంలో సమీపంలో జాతీయ రహదారిపై ట్యాంకరు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
ఇది కూడా చూడండి: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే..
ట్యాంకరు డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందుభాగం పూర్తిగా ద్వంసం అయిపోవడంతో పాటు ట్యాంకర్ అంతా తుక్కుతుక్కైంది. హైవే పెట్రోలింగ్, గార్లదిన్నె పోలీసులు గాయపడిన క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్కు తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చూడండి: ఐపీవో షేర్లు ఇస్తామంటూ.. సైబర్ నేరగాళ్లు ఏం చేశారంటే?