ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ AP: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 11 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Polavaram: దసరా పండుగ వేళ ఏపీకి తీపి కబురు అందించింది మోదీ సర్కార్. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా కొన్ని షరతులను జోడించి ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు వరుస ఢిల్లీ పర్యటనలు సఫలం అయ్యాయనే చెప్పాలి. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు నుంచి పలుమార్లు హస్తినకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఏపీ అభివృద్ధిపై, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం పూర్తి చేసేందుకు నిధులు వంటి ముఖ్యమైన అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలతో చర్చలు జరిపారు. కేంద్ర పెట్టిన షరతులు.. ప్రస్తుతం ఇచ్చిన రూ.2,348 కోట్ల నిధుల్లో 75 శాతం ఖర్చు చేస్తేనే తదుపరి విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది. నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పోలవరం నిర్మాణ పనులు జరిగితేనే తదుపరి విడత నిధులు విడుదల చేస్తాం.ఒకవేళ కాకపోతే సరైన కారణాలు తెలపండి. చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తెలపాలి. పెండింగ్ లో పడ్డ పోలవరం పనులు పూర్తి కావడానికి సమన్వయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన దానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన నిర్మాణ షెడ్యూల్‌ను ఒప్పందంలో పొందుపర్చాలని తెలిపింది. ఒప్పందంలో పేర్కొన్న పనులకే ఇప్పుడిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులను వెచ్చించాలి. నిర్దేశిత పనులకే ఆ నిధులు వినియోగించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి. వాటిని కేంద్ర జలశక్తిశాఖకు పంపాలి. ఈ నిధులకు సంబంధించిన ఖాతాలను కాగ్ అధికారులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి త్రైమాసికంలో ప్రాజెక్టు ఆర్థిక పురోగతిపై కేంద్రానికి అథారిటీ నివేదికలు సమర్పించాలి. #polavaram-irrigation-project-andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి