/rtv/media/media_files/2025/08/18/nellore-2025-08-18-07-35-17.jpg)
నెల్లూరు జిల్లా ఆసుపత్రిలో ఓ ఖైదీ రెచ్చిపోయాడు. ఆసుపత్రిలో మహిళతో రాసలీలలు నడిపాడు. ఆసుపత్రి బెడ్‌పై మహిళతో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ మర్డర్ కేసులో శ్రీకాంత్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధించింది కోర్టు. దీంతో జిల్లా సెంట్రల్ జైలులో శ్రీకాంత్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయితే అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన టైంలో.. ఆసుపత్రిలో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నాడు ఖైదీ శ్రీకాంత్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారంలో పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసులే శ్రీకాంత్‌కు సహకరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహరంపై ఇప్పటికీ జైలు అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. గతేడాది డిసెంబరులో ఈ ఘటన ఆలస్యంగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
అర్ధరాత్రి నగ్నంగా క్షుద్రపూజలు
ఓ యువకుడు అర్ధరాత్రి నగ్నంగా క్షుద్రపూజలు చేశాడు..ఏంటీ పనులు అడిగితే వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూసిక్కల్‌మేడుకి చెందిన తిరుపతి కుమారుడు పరశురామన్. ఆ ప్రాంతంలోని రాజాత్తి అనే వ్యక్తి ఇంటి ముందు నగ్నంగా కూర్చుని పూజలు చేస్తూ కనిపించాడు. కుమరన్ అనే యువకుడు అక్కడకు వెళ్లి చూసి ఎందుకు ఇలా చేస్తున్నావని కుమరన్ అతడితో గొడవపడ్డాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి సర్దిచెప్పి పంపించారు. అనంతరం ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఇంట్లో కుమరన్, అతని తల్లి నిద్రిస్తుండగా పరశురామన్ సోదరుడు శాంతకుమార్ ఇంట్లోకి చొరబడ్డాడు. కుమరన్ తలపై బండరాయితో దాడి చేసి చంపేయాడానికి యత్నించాడు. అతని తల్లి జయలక్ష్మి వెంటనే కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయలపాలైన కుమరన్‌ను తిరుప్పత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరశురామన్, శాంతకుమార్ ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.