karimnagar : సర్వపిండి క్రైమ్ : చెవుల్లో పురుగుల మందు పోసి భర్తను లేపేసింది!

అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను,భార్యలను చంపేందుకు వెనుకాడటంలేదు. పచ్చని సంసారాన్ని గుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ లో ప్రియుడితో సుఖం కోసం కట్టుకుని భర్తను ప్లాన్ చేసి మరీ కడతేర్చింది ఓ ఇల్లాలు.

New Update
sarvapindi

అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను,భార్యలను చంపేందుకు వెనుకాడటంలేదు. పచ్చని సంసారాన్ని గుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ లో ప్రియుడితో సుఖం కోసం కట్టుకుని భర్తను ప్లాన్ చేసి మరీ కడతేర్చింది ఓ ఇల్లాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   కరీంనగర్‌కు చెందిన ఐలవేని సంపత్‌ (45), రమాదేవి దంపతలకు ఇరవై ఏళ్లు నిండిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంపత్‌ కరీంనగర్‌లోని ఓ లైబ్రేరీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడగా.. రమాదేవి సర్వపిండి అమ్ముతుంది. ఆమె వద్దకు కరీంనగర్‌కే చెందిన కర్రె రాజయ్య (50) తరచూ సర్వపిండి తినడానికి వచ్చేవాడు, అక్కడ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అప్పటికే భర్త మద్యానికి పూర్తిగా బానిసై తనను వేధిస్తుండటం.. రాజయ్య ఏర్పడిన అనుబంధంతో సంపత్‌ను అడ్డు తొలగించుకోవాలని రమాదేవి పెద్ద స్కెచ్ వేసింది. ప్రియుడు రాజయ్య, తన దూరపు బంధువు కీసరి శ్రీనివాస్‌ (35)తో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. 

ఓ యూట్యూబ్‌ వీడియో ద్వారా

ఎవరి చెవుల్లోనైనా పురుగుల మందు పోస్తే ఆ వ్యక్తి  వెంటనే చనిపోతాడనే  ఓ యూట్యూబ్‌ వీడియో ద్వారా తెలుసుకున్న రమాదేవి అదే పద్ధతిలో భర్తను చంపాలని ప్లాన్ వేసింది.  ప్రియుడు రాజయ్య, శ్రీనివాస్ లకు ఇదే విషయాన్ని  చెప్పింది. పార్టీ చేసుకుందాం అంటూ జూలై 29న సంపత్‌కు వారిద్దరూ ఆఫర్‌ చేశారు. దీంతో వారిద్దరూ అదేరోజు బొమ్మకల్‌ ఫ్లైఓవర్‌ వద్దకు రావాలని చెప్పడంతో సంపత్‌ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ముగ్గురు కలిసి ఫుల్ గా తాగారు. అయితే  మత్తు ఎక్కువై సంపత్‌ తూలుతూ కింద పడిపోగానే రాజయ్య, శ్రీనివాస్‌ వెంటనే అతడి చెవుల్లో వెంటతెచ్చుకున్న గడ్డిమందును పోశారు. దీంతో  కొద్దిసేపటికి సంపత్‌ అక్కడిక్కడే చనిపోయాడు. అనంతరం వారిద్దరూ ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.  

Also read :  Srushti Fertility Centre : సృష్టి కేసులో సంచలన విషయాలు.. ఆ గ్యాంగులతో నమ్రతకు లింకు

భర్త కనిపించడం లేదంటూ

అయితే ఏమీ తెలిదన్నట్లుగా తన భర్త కనిపించడం లేదంటూ రమాదేవి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సంపత్‌ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్‌ లు కూడా పోలీసుల వద్ద నటించారు. ఆగస్టు 1న మృతదేహాన్ని గుర్తించినట్లు వారే పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే భర్త మృతికి కారణం ఏమిటని తెలుసుకునేందుకు ప్రయత్నించాల్సింది పోయి  మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దంటూ భార్య రమాదేవి పోలీసుల వద్ద ప్రాథేయపడింది. దీంతో పోలీసులు అనుమానం రావడంతో భార్య రమాదేవి కాల్‌డేటా, ఫోన్‌ లొకేషన్‌, సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపించారు. ఆమెను, రాజయ్య, శ్రీనివా్‌సను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించడంతో తామే సంపత్ ను  హత్యచేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read :  UP crime : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!

Advertisment
తాజా కథనాలు