Warangal: రిమాండ్ లో ఉన్న మహిళా ఖైదీ అనుమానస్పద మృతి

నర్సంనగర్ ప్రాంతానికి చెందిన  పెండ్యాల సుచరిత (36) 2025 ఆగస్టు 13న హనుమకొండ లోని సుబేదారి పోలీస్టేషన్ నుంచి ఓ కేసులో రిమాండ్ పై నర్సంపేట మహిళా సబ్ జైలుకు వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సుచరిత కడుపునొప్పి రావడవంతో అస్వస్థతకు గురైంది.

New Update
female

రిమాండ్ లో ఉన్న ఓ మహిళా ఖైదీ అనుమానస్పదంగా మృతి చెందిన మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా  నర్సంపేట మహిళా సబ్ జైలులో చోటుచేసుకుంది.  జైలు సూపరింటెండెంట్ శృతి వెల్లడించిన వివరాలు ప్రకారం.. నర్సంనగర్ ప్రాంతానికి చెందిన  పెండ్యాల సుచరిత (36) 2025 ఆగస్టు 13న హనుమకొండ లోని సుబేదారి పోలీస్టేషన్ నుంచి ఓ కేసులో రిమాండ్ పై నర్సంపేట మహిళా సబ్ జైలుకు వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సుచరిత కడుపునొప్పి రావడవంతో అస్వస్థతకు గురి అయింది. వెంటనే జైలు సిబ్బంది ఆమెను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం అదే రోజు సుచరితను జైలు సిబ్బంది సబ్ జైలుకు తీసుకెళ్లారు.

వాంతులు, విరేచనాలతో రావడంతో

అయితే మరుసటి రోజున అంటే గురువారం రోజున  ఉదయం సబ్ జైలులో ఉన్న సుచరితకు వాంతులు, విరేచనాలతో రావడంతో మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలింది. వెంటనే జైలు సిబ్బంది ఆమెను మళ్లీ నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుచరితను ఆస్పత్రి లోని డ్యూటీ డాక్టర్ అనూష పరీక్షించి మార్గంమధ్యలోనే మృతి చెందినట్లుగా వెల్లడించారు.

ఈ విషయంపై సబ్ జైలు సూపరింటెండెంట్ లక్ష్మీశృతి మాట్లాడుతూ వాంతులు, విరేచనాలు కావడంతోనే తాము ఆస్పత్రికి తీసుకొచ్చామని, అయితే అప్పటికే ఆమె మృతిచెందిందని తెలిపారు. అయితే ఆరోగ్యంగా ఉన్న సుచరిత ఇలా అకస్మా త్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందడంపై  కుటుంబ సభ్యులు పలు అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం పోలీసు విచారణలోనే మృతికి గల అసలు కారణాలు తెలియనున్నాయి. ఖైదీ మృతిపై జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు స్థానిక ఎస్సై రవికుమార్ వెల్లడించారు. 

అమీర్‌పేట్ లో హనీ ట్రాప్

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ లో హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. 81 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసి రూ. 7 లక్షలు కాజేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ముందుగా నిందితురాలు ఆ వృద్ధుడిని వాట్సాప్ ద్వారా  పరిచయం చేసుకుని ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. అతనికి దగ్గరై, ఇద్దరు శృంగారంలో పాల్గొన్నట్లు వీడియో రికార్డు చేసింది. ఆ వీడియో రికార్డును ఆధారంగా చేసుకుని మరోకరి చేత ఆ మహిళ వృద్ధుడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తన భర్తకు ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుందని, డబ్బులు ఇవ్వకపోతే వీడియోను లీక్ చేస్తామని బెదిరించింది. బ్లాక్ మెయిల్ తో భయపడిన ఆ వృద్ధుడు ఆ మహిళకు పలు దఫాలుగా మొత్తం రూ. 7 లక్షలు ఇచ్చాడు. పదేపదే డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన వృద్ధుడు ఈ విషయంపై తన కుటుంబ సభ్యులతో చర్చించాడు. వారి సూచన మేరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అమీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  బ్లాక్ మెయిల్ చేసిన మహిళ, ఆమెకు సహకరించిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు