Crime Story : డ్యామ్ లో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో అస్థిపంజరాలు!

మధ్యప్రదేశ్ లో ఒక డ్యామ్ నిర్వహణలో భాగంగా నీటిని తోడి వదిలేయగా.. నీరు తగ్గిపోవడంతో అక్కడ ఒక కారు, అందులో రెండు అస్థిపంజరాలు కనిపించాయి. పోలీసుల విచారణలో అవి దగ్గర ఊరిలోని వ్యక్తులవి అని గుర్తించారు. ఇది హత్య, ప్రమాదమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. 

New Update
Crime Story : డ్యామ్ లో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో అస్థిపంజరాలు!

Madhya Pradesh :  మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని కువారి నదిపై గోపి గ్రామ సమీపంలో నిర్మించిన స్టాప్ డ్యామ్‌ (Stop Dam) లో నీరు తగ్గుముఖం పట్టడంతో అందులో ఒక కారు కనిపించింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో పాటు అస్థిపంజరాలను తొలగించారు. మొదట అవి ఎవరి అస్థిపంజరాలే (Skeletons) అనే విషయం తెలియరాలేదు.

సమాచారం అందుకున్న సిహోనియా పోలీసులు (Sihoniya Police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి గ్రామం సమీపంలో ఉండడంతో గ్రామస్థులను ఆరా తీశారు. దొరికిన అస్థిపంజరాల్లో గురుద్వారా మొహల్లా అంబాహ్‌కు చెందిన ఛత్కా పురా నివాసి జగదీష్ జాతవ్ కుమారుడు నీరజ్ (26), ఛట్కా పురా నివాసి ముఖేష్ జాతవ్ భార్య మిథిలేష్ (32) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Skeletons

Crime Story :  నీరజ్ జాతవ్, మహిళ భర్త ముఖేష్ జాతవ్ బంధువులు. మహిళ భర్త అంబాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు (Government Teacher).  గురుద్వారా మొహల్లా అంబాలో అద్దెకు నివసిస్తున్నాడు. ఉపాధ్యాయుడు ముఖేష్ జాతవ్ తన భార్య మిథిలేష్ మిస్సింగ్‌పై ఫిబ్రవరిలో అంబాహ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

అదే సమయంలో నీరజ్ జాతవ్ కూడా ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. మహిళ భర్త అంబా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌ (Missing) పై ఫిర్యాదు చేశాడు, అయితే యువకుడి కుటుంబం ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. పరువు హత్యా లేక ప్రమాదవశాత్తు కారు నదిలో పడిందా అనేది తెలియరాలేదు.

Crime Story : ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు, ఈ స్టాప్ డ్యామ్ గేట్లు తెరిచి నది నుండి నీటిని బయటకు తీస్తారు, నదిని కూడా శుభ్రపరుస్తారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్టాప్ డ్యాం గేటు తెరిచారు. మధ్యాహ్నానికి నదిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో నది మధ్యలో ఓ కారు కనిపించింది. దాని చుట్టూ నదిలో ఏపుగా పెరిగిన మొక్కలు కనిపించాయి. దీంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు దర్యాప్తు మొదలు పెట్టారు.

Also Read : లేడి కానిస్టేబుల్‌ను రేప్ చేసిన ఎస్సై డిస్మిస్

#crime news #Madhya Pradesh #Crime Story #skeletons
Advertisment
తాజా కథనాలు