MS Dhoni: కెప్టెన్‌ తలాతో థలపతి.. గెస్ట్‌ రోల్‌లో ధనాధన్‌ ధోని!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'గోట్' (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గెస్ట్ రోల్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
MS Dhoni: కెప్టెన్‌ తలాతో థలపతి.. గెస్ట్‌ రోల్‌లో ధనాధన్‌ ధోని!

MS Dhoni: వెంకట్ ప్రభు తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌'. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ మీనాక్షీ శేషాద్రి, స్నేహ, లైలా, మైక్‌ మోహన్‌, జయరామ్‌, ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌, వైభవ్‌, యోగిబాబు, ప్రేమ్‌జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రంలో విజయ్ తండ్రి, కొడుకు పాత్రలో డ్యూయల్ రోల్ లో చేయడం మరో ఆసక్తికరమైన విషయం.

Also Read: Keerthi Bhat: బిగ్‌బాస్‌ బ్యూటీకి అర్థరాత్రి మెసేజ్.. క్లిక్‌ చేయగానే రూ.2లక్షలు ఫసక్‌.. ఏం జరిగిందంటే?

publive-image

తలాతో థలపతి.. గెస్ట్ రోల్ లో ధోని

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.  వెంకట్ ప్రభు, విజయ్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది.అయితే యాక్షన్ తరహాలో రూపొందుతున్న ఈ చిత్రంలో.. క్రికెట్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ధోని అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: Heeramandi: 1000 డ్రోన్లు.. కళ్ళు జిగేలుమనేలా.. ‘హీరమండి’ రిలీజ్ డేట్ రివీల్

Advertisment
తాజా కథనాలు