/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-17-4.jpg)
Divorce : భారత క్రికెటర్ హార్డిక్ పాండ్యా (Hardik Pandya) నటి నటాషా (Natasha Stankovic) దంపతులకు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రేమించి పెళ్లాడిన హార్డిక్-నటాషా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నటాషా తన ఇన్‌స్టా ఖాతాలో పాండ్యాతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించిందని, డివోర్స్ (Divorce) కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఈ మేకు నటాషా.. ఇన్‌స్టా యూజర్‌నేమ్‌లో పాండ్యా అనే పదాన్ని డిలిట్ చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు సోషల్ మీడియా (Social Media) లో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరూ ఈ మధ్య కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకోలేదు. ఫిబ్రవరిలో లవర్స్ డే రోజు పాండ్య పోస్ట్ చేసిన ఫొటోనే చివరిది. కాగా ఐపీఎల్ టోర్నీ సమయంలోనూ నటాషా స్టాండ్స్‌లో కనిపించకపోవడంతో మరింత బలం చేకూరింది. అలాగే మార్చి 4న నటాషా బర్త్ డే రోజు పాండ్య విష్ చేయలేదు. ఈ క్రమంలో ఇరువురి ఫాలోవర్స్ వీరిద్దరూ విడిపోతున్నారంటూ కామెంట్స్ చేస్తు్న్నారు. కానీ ఇప్పటివరకూ పాండ్యా, నటాషాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే.. 2019 డిసెంబర్ 31న దుబాయ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జోడి.. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అదే సంవత్సరం జులైలో నటాషా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు.
Also Read : రేపే ఫైనల్స్.. ట్రోఫీతో ఫోజులిచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు
 Follow Us
 Follow Us