Ambati Rayudu: వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చాడు క్రికెటర్ అంబటి రాయుడు. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాట్టు ప్రకటించాడు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానంటూ ట్వీట్ చేశాడు. తరువాత ఏం చేయాలనుకుంటున్న దాని గురించి త్వరలోనే చెబుతానని అంటున్నాడు. అంబటి రాయుడు ట్వీట్ (Ambati Rayudu Tweet) చూసి వైసీపీ నేతలు, కార్యకర్తలూ షాక్ అవుతున్నారు. సడెన్‌గా ఏమైంది బ్రో అని కార్యకర్తలు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
చేరిన పదిరోజులకే...
క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో (YCP Party) చేరి పదిరోజులే అవుతోంది. ఇంతనే ఈ డెసిషన్ తీసుకోవడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్ (CM YS Jagan) పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఇంతలోనే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించారు, కారణం ఏమై ఉంటుందని టాక్ నడుస్తోంది.
గుంటూరుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను రమ్మనడమే కారణమా?
గుంటూరు ఎంపీ టికెట్‌ను (Guntur MP Ticket) అంబటి రాయుడుకి ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. అయితే తాజాగా నరసారావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులుని గుంటూరు స్థానానికి మారాల్సిందిగా నిన్న జగన్ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్ధికి కేటాయించాలని అనుకుంటున్నామని తెలిపారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు రానని చెప్పేశారు. అంబటి రాయుడు ఇప్పుడు పార్టీలో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఇదే అయ్యుంటుందా అని పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి.
Also Read: సారీ హైదరాబాదీస్..ఫార్ములా ఈ రేస్ రద్దు