Nijjar - Justin Trudeau : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య(Suicide) వెనుక భారత ఏజెండ్ల హస్తముందని కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో(Justin Trudeau) గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి ఇరుదేశాల మధ్య దౌత్యపరంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కేసు దర్యాప్తుపై తాజాగా స్పందిన ట్రూడో మళ్లీ భారత్‌పై నోరుపారేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నామని.. కానీ ఈ కేసులో భారత ప్రభుత్వ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని అన్నారు.
Also Read : 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తొలగింపు.. ఎక్కడంటే
తేలిగ్గా తీసుకోలేం
కెనడా(Canada) కు చెందిన ఓ మీడియా ఛానల్ కార్యక్రమంలో జస్టీన్ ట్రూడో పాల్గొన్నారు. నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ' కెనడలో మన పౌరుడిపై హత్య జరిగింది. ఇది చాలా తీవ్రమైన అంశం. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని మేను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉంది. ఇందుకోసమే ఈ అంశాన్ని మేము సీరియస్‌గా తీసుకున్నామంటూ' ట్రూడో వ్యాఖ్యానించారు.
కొనసాగుతున్న దౌత్యవివాదం
ఇదిలా ఉండగా.. గత ఏడాది జూన్ ఖలిస్థానీ ఉగ్రవాది(Terrorist) నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని.. ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది. ఆయన చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటామని భారత్ కెనడాకు చాలాసార్లు చెప్పింది. అయితే తాజాగా ట్రూడో మళ్లీ ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : గూగుల్‌లో 1.2 ఖాతాల తొలగింపు.. ఏఐ మోసగాళ్ళకు చెక్