AP News: చంద్రబాబుని జగన్ ఏమీ చేయలేరు..వైసీపీ పాలనపై మండిపడ్డ సీపీఎం నేత జగదీష్

రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని రైతాంగ సమస్యలను నిస్మరించిన సీఎం జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేరని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు.

New Update
AP News: చంద్రబాబుని జగన్ ఏమీ చేయలేరు..వైసీపీ పాలనపై మండిపడ్డ సీపీఎం నేత జగదీష్

CPM leader Jagdish: స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొని రాయలసీమలోనే కాక కృష్ణా డెల్టాలో కూడా సాగునీరు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలోని 18 జిల్లాలలోని 480 మండలాల్లో పూర్తిగా కరువు నెలకొంద జగదీష్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కరువుపై దృష్టి సారించడం లేదని జగదీష్ ఆరోపించారు. కరువుపైన ఈనెల 3వ తేదీన జరిగిన క్యాబినెట్‌లో చర్చించలేదని, కేవలం చంద్రబాబుపై అక్రమ కేసుల బనాయించడంలోనే తన అధికార కాల పరిమితిని పూర్తి చేస్తున్నారన్నారు.

ప్రతిపక్షాలను భయాందోళనలకు గురి చేస్తున్నారు

సీఎం జగన్‌ చంద్రబాబు ఏమీ చేయలేడని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలను భయాందోళనలకు గురి చేయడం, దొంగ ఓట్లను చేర్పించడంలో జగన్‌ పాలన సాగుతుందని జగదీష్ విమర్శలతో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు విపత్తు నెలకొందన్నారు. శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్‌లోను నీరు అడుగంటి పోయి.. డ్యాంల కింద సాగు చేస్తున్న రైతులు పూర్తిగా నష్టపోయారని జగదీష్ మండిపడ్డారు. కరువు మండలాలకు కనీస సహాయక చర్యలు చేపట్టడంలో జగన్‌ ప్రభుత్వం వైఫల్యం చెందారని జగదీష్ ఫైర్‌ అయ్యారు. జిల్లాలో 31 మండలాల్లో కరువు నెలకొంటే కేవలం 27 మండలాలను కరువు మండలాలకు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రభుత్వం స్పందించలేదు

మండలాలలో కరువు కనిపించడం లేదా..? జిల్లా మంత్రి ఏం చేస్తున్నారని జగదీష్ ప్రశ్నించారు. ప్రకటించిన కరువులలో కనీస సహాయక చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా నుంచి వలస కూలీలు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారన్నారు.. ఈ సంఘటనపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి వ్యవసాయ పరిశీలన చేపట్టినట్లు ఆయన తెలిపారు. పరిశీలన పూర్తికాగానే నవంబర్ ఆఖరిలో కానీ.. డిసెంబర్ మొదటి వారంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలిసి వచ్చే పార్టీలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జగదీష్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: జగన్‌పై గంటా శ్రీనివాసరావు మండిపాటు.. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం

Advertisment
తాజా కథనాలు