Breaking: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్

జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాధాకృష్ణన్‌ను అడిషనల్ గవర్నర్‌గా నియమించారు. పుదచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్ బాధ్యతలను కూడా రాధాకృష్ణన్‌కే అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.

Breaking: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్
New Update

Telangan Governer: జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాధాకృష్ణన్‌ను అడిషనల్ గవర్నర్‌గా నియమించారు. దీంతో పాటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా ఆయననే నియమించింది కేంద్ర ప్రభుత్వం. అంతకు ముందు తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. లోకస‌భ ఎన్నికల వేళ ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుండగా ఆమె ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణకు తదుపరి గవర్నర్ ఎవరనేది ఆసక్తికర అంశంగా మారింది. మరోవైపు తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.

ఆంధ్రా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బాధ్యతలు..
నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా ఎవరు రాబోతున్నారనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త గవర్నర్ నియామకం ప్రస్తుతం లేనట్లుగనే తెలుస్తోంది. ఎన్నికలు ముగిసే వరకూ మరో రాష్ట్ర గవర్నర్‌‌కు తెలంగాణ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు నడిచాయి.

తెలంగాణ ప్రజలను మరువను..
ఇదిలావుంటే.. రాజీనామ అనంతరం తమిళసై మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉందన్నారు.’తెలంగాణ ప్రజలందరు నా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు. ఎప్పుడు తెలంగాణ ప్రజలను మరువను. అందరితో కలుస్తూ ఉంటా’అని చెప్పారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎంపీగా ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారని ప్రశ్నించగా.. సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. తమిళ నాడులోని తూత్తుకూడి, చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యకుమారిల్లో ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు చర్చ నడుస్తోంది. ఇక తెలంగాణ గవర్నర్ తో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.

Also Read:Bengaluru : బెంగళూరు వాసులకు గుడ్‌న్యూస్..రానున్న రోజుల్లో వర్షాలు

#telangana #governer #cp-radha-krishnana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe