ICMR: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే గుండెపోటు రాదు.. ఒక్కడోసు అయినా ఓకే.. ఐసీఎంఆర్ అదిరే శుభవార్త! యువతలో ఇటీవల సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని ఐసీఎంఆర్ ఓ అధ్యయనంలో వెల్లడించింది. కేవలం జీవన శైలిలో వచ్చిన మార్పులు, మద్యం సేవించడం, అధికంగా జిమ్ చేయడం వంటి వాటి వల్లే మరణాలు వస్తున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. By Bhavana 21 Nov 2023 in నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి కొవిడ్.. ఈ పేరు వింటే ఇప్పటికీ చాలా మందికి వెన్నులో వణుకుపుడుతుంది. దాని భారీ నుంచి కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున టీకా ప్రచారాన్ని ప్రారంభించింది.దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ లు పంపిణీ చేసింది. ఇదిలా ఉంటే..గత ఏడాదిన్నర కాలం నుంచి యువతలో గుండెపోటు మరణాలు అధికం అయ్యాయి. దీని వెనుక కొవిడ్ వ్యాక్సిన్ నే కారణమంటూ చాలా చర్చలు కూడా జరిగాయి. దీని గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సమాధానం ఇచ్చింది. ఐసీఎంఆర్ ఇటీవల ఓ రీసెర్చ్ చేసింది. దానిలో కొవిడ్ వ్యాక్సిన్ కి , ఈ ఆకస్మిక మరణాల ప్రమాదాలకి సంబంధం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. కొవిడ్ -19 కి ముందు ఆసుపత్రిలో చేరడం, కుటుంబంలో ఆకస్మిక మరణాల పాత కేసులు, జీవన శైలిలో వచ్చిన మార్పులు ఆకస్మిక మరణాల అవకాశాలను పెంచాయని నివేదిక పేర్కొంది. వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ లో ఒక్క డోస్ తీసుకున్న సరే కరోనా వల్ల సంభవించే మరణాన్ని నివారించవచ్చని కూడా వివరించింది. కేవలం కుటుంబ వారసత్వంగా వచ్చిన మరణాలు, చనిపోయే ముందు మద్యం సేవించడం , డ్రగ్స్ తీసుకోవడం లేదా తీవ్రమైన వ్యాయామం చేయడం వంటి కొన్ని కారణాల వల్ల అని ఐసీఎంఆర్ వివరించింది. ఈ అధ్యయనాన్ని ఐసీఎంఆర్ అక్టోబర్ 1, 2021 నుంచి మార్చి 31 2023 వరకు నిర్వహించింది. ఇందులో దేశ వ్యాప్తంగా 47 ఆసుపత్రులు ఉన్నాయి. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు, స్పష్టంగా ఆరోగ్యంగా ఉన్నవారిని అధ్యయంన కోసం చేర్చారు. వారిలో ఎవరూ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు కాదు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాల ప్రమాదం చాలా తక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. "COVID-19 vaccination did not increase the risk of unexplained sudden death among young adults in India. Past COVID-19 hospitalization, family history of sudden death and certain lifestyle behaviours increased the likelihood of unexplained sudden death," says ICMR Study pic.twitter.com/pmeh0et1On— ANI (@ANI) November 21, 2023 Also read: విమానాన్ని ఢీకొన్న ట్రాక్టర్..24 సర్వీసులు రద్దు..ఏం జరిగిందంటే! #covid-19 #vaccine #icmr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి