Covid 19 : మళ్లీ మాస్కులు రాబోతున్నాయా..? అవుననే అంటోంది వైద్యశాఖ! రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం వ్యర్థ నీటిలో కొవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ నివేదికలో వెల్లడించింది. దీనికి ‘ఫ్లిర్ట్’ అని పేరు పెట్టారు. By Bhavana 20 May 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Covid 19 New Variant : గత కొంతకాలంగా కొవిడ్ (Covid 19) తగ్గిందని అనుకుంటుంటే మరోసారి తన విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతుంది. రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు (Covid Cases) పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం వ్యర్థ నీటిలో కొవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ నివేదికలో వెల్లడించింది. దీనికి ‘ఫ్లిర్ట్’ అని పేరు పెట్టారు. అమెరికా, సింగపూర్ సహా అనేక దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు వేగంగా విజృంబిస్తున్నాయి. అయితే, వేగంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్ వల్ల సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. సీడీసీ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 14 నుంచి 27 వరకు అమెరికాలో దాదాపు 25 శాతం కేసులకు కేపీ.2 సబ్ వేరియంట్ కారణంగా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా జేఎన్.1, కేపీ.1, కేపీ.2 ఉప వేరియంట్లు విస్తరిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ప్రస్తుతం సింగపూర్ (Singapore) లో మూడింట రెండువంతుల కంటే ఎక్కువ కేసులు కేపీ.1, కేపీ.2 వేరియంట్ కేసులున్నాయి. ఈ వేరియంట్ ఒమిక్రాన్‌ను పోలి ఉంటుంది. వేగంగా సోకుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. సీడీసీ డేటా ప్రకారం ఫ్లిర్ట్ వేరియంట్.. కేజీ.1.1, కేపీ.2 వేరియంట్లు ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఈ వైవిధ్యం కారణంగా సంక్రమణ కేసులలో చాలా వేగంగా పెరుగుదల ఉందని గుర్తించారు. అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ మేగాన్ ఎల్ మాట్లాడుతూ ఫ్లిర్ట్‌లో కొన్ని ఆందోళనకరమైన లక్షణాలు కనిపించాయని అధికారులు పేర్కొన్నారు. స్పైక్ ప్రోటీన్ (Spike Protein) లో మార్పులు ఉన్నాయని.. ఇవి సులభంగా మానవ శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయి. కేవలం ఈ నెల మొదటి వారం నుంచే అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడంతో ప్రజలు మరోసారి తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. కొవిడ్ కొత్త దశ ప్రారంభంలో ఉన్నామని.. కేసులు నిరంతరం భారీగా పెరుగుతున్నాయని.. వచ్చే రెండు, నాలుగు వారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రాబోతున్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి మాస్క్‌లు ధరించడం అలవాటు చేసుకోవాలని, తద్వారా వైరస్‌ని కంట్రోల్ చేయోచ్చని తెలిపారు. జూన్ నెలాఖరు వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాల్సి ఉందన్నారు. కొత్త వేరియంట్ ఫ్లిర్ట్ కేసులు భారత్‌లోనూ నమోదయ్యాయి. ఇప్పటి వరకు 250 వరకు కేసులు నమోదయ్యాయని తెలుస్తున్నది. మహారాష్ట్రలోనే కేపీ.2కి చెందిన 91 కేసులను గుర్తించారు. రాష్ట్రంలోని కరోనా కేసుల పెరుగుదలనుసూచిస్తుంది. మే 15 వరకు పూణేలో అత్యధికంగా 51 మందికి ఈ కొత్త వేరియంట్ సోకింది. 20 కేసులతో థానే రెండో స్థానంలో ఉంది. Also read: ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశం గుర్తింపు!? #india #flirt-variant #covid-19-updates #covid-cases మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి