WHO: మళ్ళీ కలవరపెడుతున్న కోవిడ్..డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

కోవిడ్ లేదా కరోనా...దీని పేరు వింటేనే అందరి గుండెల్లో దడ పుడుతుంది. రెండేళ్ళు మరణ మృదంగం వాయించిన ఈ మహమ్మారి మళ్ళీ భయపెడుతోంది. కొన్ని వారాలుగా 84 దేశాలలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్‌వో కూడా వార్నింగ్ ఇస్తోంది.

Health News: కరోనా బాధితులకు షాకింగ్‌ న్యూస్.. వెంటనే డాక్టర్‌ను కలవండి!
New Update

Covid -19: కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. 84 దేశాల్లో ఈ వైరస్ నెమ్మదిగా వ్యాపిస్తోంది. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది. 84 దేశాల్లో కోవిడ్ తీవ్రమైన వైవిధ్యాలతో విస్తరించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. 84 దేశాల్లో పాటిజివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయని..ఈసారి తీవ్రత మరో రూపంలో మరింత ఎక్కువ ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఐరోపా దేశాల్లో 20 శాతం కంటే ఎక్కువ కేసులు ఇప్పటికే నమోదయ్యాయని...ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ జెనీవా అన్నారు.

మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రపంచ నలుమూలనుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో కోవిడ్ -19 టెస్టులు నిర్వహించారు నిర్వాహకులు. దీంతో దాదాపు 40 మందికి పైగా పాజిటివ్‌గా రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కోవిడ్ -19 వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతోందని, దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే వైరస్ – SARS-CoV-2 పరీక్షల శాతం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ వాన్ కెర్ఖోవ్ తెలిపారు.

Also Read:Adani:ఆదానీ కంపెనీల్లో సెబీ ఛైర్ పర్శన్‌కు వాటాలు

#who #positive #coivd-19 #corona
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe