MLC Kavitha To Tihar Jail? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ తొమ్మిది వరకు కోర్టు రిమాండ్ ఇచ్చింది. దాంతో పాటూ ఆమెను జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను కాసేపట్లో అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. మరోవైపు ట్రయల్ కోర్టు ఆమె మధ్యంతర బెయిల్ కేసును వాయిదా వేసింది. దీనిని ఏప్రిల్ 1కు వాయిదా వేసింది కోర్టు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని...దాని కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు.
కోర్టులో వాదనలు ఇలా..
ఈరోజు ట్రయల్ కోర్టులో ఈడీ ముందు నుంచే రిమాండ్ కోసం ప్రయత్నిస్తోంది. 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోసం ఈడీ (ED) తరుఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. కేసులో దర్యాప్తు చేయవలసింది ఇంకా ఉందని...నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నామని తెలిపారు. అయితే కవిత తరుఫు న్యాయవాదులు మాత్రం కవిత కొడుక్కి పరీక్షల షెడ్యూల్ విడుదల అయిందని...దాని కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న తరువాత కోర్టు ఈ కేసును కాసేపు రిజర్వులో ఉంచింది. అనంతరం కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాను క్లీన్‌గా బయటకు వస్తా..
అంతకు ముందు తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని నమ్మకంగా చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తాను ఏ తప్పూ చేయలేదని… కచ్చితంగా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని…పొలిటికల్ లాండరింగ్ కేసని అంటున్నారు కవిత. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చేమో కానీ… తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఎవరూ దెబ్బ తీయలేరని చెప్పారు కవిత. ఇందులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీ(BJP) లో చేరాడు. మరో నిందితుడు బీజేపీ టికెట్ పొందాడు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) రూపంలో బీజేపీకి రూ.50కోట్లు ఇచ్చాడని చెప్పుకొచ్చారు. అయితే ఎవరు ఎలా ఉన్నా… తాను మాత్రం క్లీన్‌గా బయటికొస్తానని ఈడీ అధికారులు ఆమెను కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దాంతో పాటూ జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు కూడా చేశారు.
Also Read:Tamil Nadu: ఒకప్పుడు సీఎం…ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ..పన్నీర్ సెల్వం పరిస్థితి