Bengaluru: లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్

లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ నేత సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జేడీఎస్‌ కార్యకర్తపై సూరజ్ రేవణ్ణ అసహజ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి.

New Update
Bengaluru: లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్

Suraj Revanna: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సూరజ్ రేవణ్ణపై 27 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్ 16న గన్నికాడలోని తన ఫామ్‌హౌస్‌లో సూరజ్ రేవణ్ణ తనను లైంగికంగా వేధించాడని సదరు వ్యక్తి ఫిర్యాదులో ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా హోలెనరసిపుర పోలీసులు సూరజ్ రేవణ్ణపై సెక్షన్ 377, 342 కింద కేసు నమోదు చేశారు. సూరజ్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనువడు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ సూరజ్‌ రేవణ్ణ ఖండించారు. తన నుంచి రూ.5 కోట్లు దోపిడీ చేసేందుకు సదరు వ్యక్తి తప్పుడు ఫిర్యాదు చేశారని సూరజ్‌ ఆరోపించారు. సూరజ్ రేవణ్ణపై పార్టీ కార్యకర్తే లైంగిక వేధింపుల తప్పుడు కేసు పెట్టారని సూరజ్ రేవణ్ణ సన్నిహితుడు శివకుమార్ ఆరోపించారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన సూరజ్‌కు తాజాగా బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను బెంగళూరు కోర్టు మంజూరు చేసింది. మరోవైపు ప్రజ్వ్ రేవన్ణ కూడా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు.

Also Read:Law Set: వచ్చేనెల 5 నుంచి లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

Advertisment
తాజా కథనాలు