Law Set: వచ్చేనెల 5 నుంచి లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

ఎల్‌ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సు అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో లాసెట్, పీజీఎల్ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు.

New Update
Law Set: వచ్చేనెల 5 నుంచి లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

Law Set Adimissions: లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ డేట్స్‌ను రిలీజ్ చేశారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో లాసెట్, పీజీఎల్ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు.కౌన్సెలింగ్ కు ఈనెల 24న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కాగా ఆగస్టు 5 నుంచి రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. వచ్చేనెల 5 నుంచి 20 వరకూ ఆన్ లైన్ రిజిస్ర్టేషన్లతో పాటు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు.

ఆగస్టు 22 , 23 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని, 24న ఎడిట్ ఆప్షన్ ఉంటుందని తెలిపారు. 27న సెలెక్షన్ లిస్ట్ ను వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 30 లోగా కాలేజీల్లో రిపోర్టు చేసి, సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో పాల్గొనాలని సూచించారు. ఇదిలా ఉండగా లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షకు మొత్తం 50,684 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 3న నిర్వహించిన పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వారిలో 29,258 మంది క్వాలిఫై అయ్యారు.

Also Read:Telangana: ఎవ్వరు అడ్డం పడ్డా..నా విగ్రహం పెట్టించుకుంటా -మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు