Kavita : కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..

ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ ఈ రోజుతో ముగిసిన సంగతి తెలిసిందే. ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. జ్యూడిషల్ రిమాండ్‌ను న్యాయస్థానం ఏప్రిల్ 23 వరకు పొడిగించింది

New Update
Kavita : ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత..

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈ రోజుతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ(ED) అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) లో హాజరుపరిచారు. ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ గడువు పొడిగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. కవితకు జ్యూడిషల్ కస్టడీ గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగించింది.

Also Read: త్వరలో బస్సు యాత్ర ప్రారంభించనున్న కేసీఆర్‌..!

ముందుగా.. ఢిల్లీ లిక్కర్‌ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని.. కవిత ఒకవేళ బయట ఉంటే ఈ దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ తమ వాదనలు వినిపించింది. ఇందుకోసం జ్యుడిషియల్‌ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ కస్టడీ పొడిగించేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేస్తూ.. జ్యుడిషియల్‌ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకు న్యాయమూర్తి పర్మిషన్ ఇవ్వడంతో వారు కవితను కలిశారు.

ఇదిలాఉండగా.. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్‌(Hyderabad) లో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె అరెస్టు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈడీ అధికారులు ఆమెను రెండు విడతలుగా విచారణ చేశారు. ఆ తర్వాత మార్చి 26న తీహార్‌ జైలుకు తరలించారు. ఆమెకు కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడి విధించగా.. నేటితో అది ముగిసింది. ఇప్పుడు మళ్లీ కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

Also Read: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బలైపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం..

Advertisment
తాజా కథనాలు