Couple Won 10 Cr Lottery: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తీసేంత వరకూ తడుతుందని అంటారు పెద్దలు. ఇది వంద శాతం నిజమే. అయితే, వరించిన అదృష్టాన్ని(Fortunate) సరిగా ఉపయోగించుకున్నోడు జీవితంలో సెట్ అవుతాడు. అలా కాకుండా ఆవేశపడి హల్ చల్ చేస్తే.. జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటాడు. అందుకే వరించిన అదృష్టాన్ని, వచ్చిన సంపదను ఆచితూచి వినియోగించాలని చెబుతారు. తాజాగా ఓ జంట విషయంలో ఇదే జరిగింది. ఒక్క మేసేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారు. ఏకంగా రూ. 10 కోట్లు(Money) గెలుచుకున్నారు. మరి వారు ఆ డబ్బును ఏం చేశారో తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది చాలా కీలకం. అందుకే ఆ డబ్బును సంపాదించేందుకు ప్రతి ఒక్కరూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు శ్రమిస్తుంటారు. కొందరు డబ్బు విలువ తెలిసి.. సేవింగ్స్ చేసుకుంటారు. మరికొందరు డబ్బును వృథాగా ఖర్చు చేస్తుంటారు. ఇక డబ్బు లేని వారు.. దేవుడా తమకు ఏదైనా లాటరీ తగిలేలా చూడు సామీ, లేదంటే ఏదైనా డబ్బుల మూట దొరికేలా చూడు సామీ అంటూ ప్రార్థిస్తుంటారు. మరి ఆ దేవుడే మీ మాట విని.. మిమ్మల్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతే? ఇంకేముంది ఎగిరి గంతేస్తారు. తాజాగా ఓ జంట ఇదే ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. ఆ జంటకు రూ. 10 లక్షల జాక్ పాట్ తగిలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
క్రెయిగ్, కరెన్ మిచెల్ అనే జంటకు నేషనల్ లాటరీలో జాక్‌పాట్ గెలుచుకున్నారు. 53 ఏళ్ల వయసులో ఈ జంటకు రూ. 10 కోట్లు లభించింది. క్రెయిగ్, కరెన్ మిచెల్ ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల వారు సెలవుల్లో ఉండగా.. క్రెయిగ్ మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. ఏంటా అని చూసి చదివితే.. కళ్లు జిగేల్‌మనే వార్త కనిపించింది. వారికి లాటరీ తగిలిందని, రూ. 10 కోట్లు గెలుచుకున్నట్లు ఆ మెసేజ్ సారాంశం.. ఇంకేముంది.. ఎగిరి గంతేశారు.
అయితే, వచ్చిన ఈ డబ్బును క్రెయిగ్, కరెన్ ఇద్దరూ ఏం చేశారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇంత డబ్బు వస్తే ఎవరైనా లగ్జరీగా ప్లాన్ చేస్తారు. కానీ, వీరు మాత్రం లగ్జరీ లైఫ్ గురించి ఆలోచించకుండా.. తమకు ఎంతో ఇష్టమైన బెడ్ షీట్‌ను మాత్రమే ఆ డబ్బుతో కొనుగోలు చేశారు. అంతేకాదు.. లాటీరీలో వచ్చిన డబ్బును వృథా చేయబోమని, ఈ డబ్బును తమ పిల్లలు, కుటుంబ సభ్యుల భవిష్యత్ కోసం వినియోగించడం జరుగుతుందన్నారు. అంతేకాదు.. డబ్బు వచ్చింది కదా అని ఇంట్లో కూర్చోబోమని, వాహనాలు కూడా కొనుగోలు చేయబోమని తెలిపింది ఈ జంట. ఎంతైనా వీళ్లు నిజంగా ఆదర్శవంతులే అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ కాలంలో కొంత డబ్బు ఉంటేనే ఆడంబరాలకు పోతుంటారు జనాలు.
Also Read:
స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియా,అఫ్ఘాన్ మ్యాచ్ సమయంలో ఏం జరిగిందంటే?
శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ