Bengaluru : కారు పార్కింగ్‌ కోసం భార్యభర్తలను చితకబాదిన పొరుగింటి వారు!

బెంగళూరులో ఓ వ్యక్తి తన కారును అపార్ట్ మెంట్‌ ముందు ఖాళీ ప్రదేశంలో పార్క్‌ చేశాడు. దానిని చూసిన పొరుగింటి వారు ఆ కారును అక్కడి నుంచి తీయాలని వారితో వాగ్వాదానికి డమే కాకుండా వారిని చితకబాదారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది..

New Update
Bengaluru : కారు పార్కింగ్‌ కోసం భార్యభర్తలను చితకబాదిన పొరుగింటి వారు!

Car Parking Issue : పొరుగింటి వారు(Neighbors) కారు పార్కింగ్‌(Car Parking) కోసం పొరుగింటి వారు భార్యభర్త(Wife & Husband) లను చితకబాదిన ఘటన బెంగళూరు(Bengaluru) లో జరిగింది. సీసీ కెమెరా(CC Camera) లో రికార్డు అయిన దృశ్యాల్లో ఓ వ్యక్తి తన కారును అపార్ట్ మెంట్‌ ముందు ఖాళీ ప్రదేశంలో పార్క్‌ చేశాడు. దానిని చూసిన పొరుగింటి వారు ఆ కారును అక్కడి నుంచి తీయాలని వారితో వాగ్వాదానికి దిగారు.

అయితే కారు పార్కు చేసిన భార్య భర్తలు ఇద్దరు కూడా వారితో గొడవకు దిగారు. దీంతో ముందు కారు తీయమని చెప్పిన వ్యక్తులు కారు గల వ్యక్తిని కొట్టడం ప్రారంభించారు. అతనిని నేల మీద పడేసి కాలితో తన్నుతూ బాగా కొట్టారు. దీంతో బాధితుని భార్య వారిని వద్దని వారిస్తున్నప్పటికీ వినకుండా ఆమె పై కూడా దాడికి దిగారు.

దీంతో ఆమె తన మొబైల్‌ తో ఘటన అంతటిని షూటింగ్‌ చేస్తుంటే ఆ గుంపులోని ఓ మహిళ ఆమె ను వెంబడించి చెప్పులతో కొట్టింది. ఈ సంఘటన అంతటిని మరోకరు వీడియో తీశారు. బాధితుల్ని రోహిణి, సహిష్ణుగా గుర్తించారు. వారు ఒక రోజు ముందే ఆ అపార్ట్ మెంట్ లోనికి వచ్చినట్లు తెలుస్తుంది.

రోహిణీ(Rohini) ని కొట్టడానికి వచ్చినప్పుడు ఆమె సహాయం కోసం అరుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ కావడంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నిందితులందరినీ అరెస్టు చేశారు. సెక్షన్ 354, 324, 506 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Also Read : మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి ఐటీ పంజా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు