Watch Video: భారీ వర్షాలు.. వరదలో కారుపై చిక్కుకున్న జంట.. చివరికి ?

గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కారులో ప్రయాణిస్తున్న ఓ జంట వరదలో చిక్కుకపోయింది. దీంతో వాళ్లు ఆ కారు పైభాగానికి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. చివరికి సహాయక బృందాలు అక్కడికి చేరుకుని ఆ జంటను రక్షించాయి.

New Update
Watch Video: భారీ వర్షాలు.. వరదలో కారుపై చిక్కుకున్న జంట.. చివరికి ?

గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు, నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ జంట కారులో ప్రయాణిస్తుండగా నదిలో చిక్కుకపోయింది. దీంతో వాళ్లు ఆ కారు పైకి ఎక్కి కూర్చున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: సీఎం రేవంత్

ఇక వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని సంబర్‌కంట అనే ప్రాంతంలో కారులో వెళ్తున్న ఓ జంట వరదలో చిక్కుకుంది. కారు వరద నీటిలో మునిగిపోవడంతో ఆ జంట కారు పైభాగానికి చేరుకుంది. సాయం కోసం దాదాపు రెండు గంటల పాటు వాళ్లు ఎదురుచూశారు. ఆ తర్వాత ఎట్టకేలకు ఘటనాస్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. వారిని సురక్షితంగా కాపాడాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ కారు వరదలో కొట్టుకపోయింది. ఒకవేళ సహాయక చర్యలకు ఆలస్యమయ్యి ఉంటే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం ఉండేది.

Advertisment
తాజా కథనాలు