Hyderabad: బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం.. రూ.3 కోట్లతో దంపతులు పరార్

రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీల పేరుతో మూడు కోట్ల రూపాయలు వసూల్ చేసి దంపతులు పారిపోయిన ఘటన హైదరబాద్ లో చోటుచేసుకుంది. సమీనా, ఇస్మాయిల్, జెస్సికా ముగ్గురు 100కు పైగా నకిలీ బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేసి ఉడాయించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Hyderabad: బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం.. రూ.3 కోట్లతో దంపతులు పరార్
New Update

Beauty parlour: బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రోజ్ గోల్డ్ (Rose Gold) బ్యూటీ పార్లర్ పేరుతో మోసం చేసి మూడు కోట్ల వసూళ్లు చేసి ఉడాయించారు కిలాడి దంపతులు. దీంతో ఈ ఘటన హైదరాబాద్ (hyderabad) లో సంచలనంగా మారింది.హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ అడ్డాగా అక్క సమీనా (Sameena), బావ ఇస్మాయిల్ (Ismail), మరదలు జెస్సికా (Jessica) కలిసి.. నకిలీ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో కోసం యూ ట్యూబ్ ఛానెళ్లతో యాడ్స్ ఇచ్చారు. కస్టమర్లను ఆకట్టుకునే విధింగా యాడ్స్ చేసి, ఎక్కువ డబ్బు వస్తుందని వారిని నమ్మించారు. ఆ యాడ్స్ చూసిన బాధితులు ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడ్డారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ వారికి కాంటాక్ట్ అయ్యారు. వారి వలలో పడ్డ వారిని మిస్ అవకుండా రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ డబ్బుల వల వేశారు.

మంగళ సూత్రాలు అమ్మి..
దీంతో ఆ వలలో చిక్కుకున్న కస్టమర్లు లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఇరు నగరంలోనే కాదు.. జిల్లాల వారాగా పాకింది. బాధితులు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం 3 లక్షల 20 వేలు దంపతులు వసూలు చేసినట్లు సమాచారం. 100 కి పైగా పార్లర్లు ఓపెన్ చేసి మూడు కోట్లతో ఉడాయించినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35 వేలు జీతం ఇస్తామని దంపతులు సమీనా, ఇస్మాయిల్ నమ్మించారు. దీంతో దంపతుల మాయమాటలు నమ్మి కొందరు మంగళ సూత్రాలు అమ్మి, అప్పు చేసి ఫ్రాంచైజీని తీసుకున్నారు. రెండు మూడు నెలల పాటు జీతం ఇచ్చారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

ఇది కూడా చదవండి : Bibinagar: కోమటి రెడ్డి, సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్

ఫోన్లు స్విచ్ఛాఫ్..
జీతం ఇవ్వడానికి రేపు, మాపు అంటూ కాలం గడిపారు.. వస్తాయని ఆశతో వున్న కస్టమర్లకు నెల నెల నిరాశే ఎదురైంది. చివరకు జీతాల కోసం దంపతులకు కాల్ చేయగా ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడకు వెళ్లిన కస్టమర్లు షాక్ తిన్నారు. హెడ్ ఆఫీస్ కు తాళం వేసి ఉండటంతో లబోదిబో మన్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టామని వాపోయారు. ఆ దంపతులను పట్టుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులకోసం గాలింపు చేపట్టారు. గతంలో కామారెడ్డి జిల్లాలోను చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు ఆరోపణలు వున్నాయని పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి వారిని ఎలా నమ్ముతున్నారో అర్థకావడంలేదన్నారు. ఇప్పటి కైనా ప్రజలు ఇలాంటి వారిపట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

#hyderabad #fraud #couple #beauty-parlour #rose-gold
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe