Electric Vehicles: విదేశాల ఎలక్ట్రిక్ వెహికల్స్ చౌకగా మారొచ్చు.. ఎందుకంటే.. 

విదేశీ కార్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టెస్లా కారు భారత్ తీసుకురావడానికి ఎలోన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. 40 శాతం కారును ఇక్కడే తయారు చేస్తే కస్టమ్స్ డ్యూటీ తగ్గించే ఆలోచన చేస్తామని ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది. 

New Update
Electric Vehicles: విదేశాల ఎలక్ట్రిక్ వెహికల్స్ చౌకగా మారొచ్చు.. ఎందుకంటే.. 

Electric Vehicles: వచ్చే ఏడాది నుంచి విదేశాల నుంచి వచ్చే ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.  కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలపై వచ్చే 5 ఏళ్లపాటు దిగుమతి సుంకాన్ని (Import Tax) తగ్గించవచ్చు.

మీడియా నిరిపోర్ట్స్ ప్రకారం, దేశంలో తయారీ కోసం టెస్లా వంటి కంపెనీలను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టెస్లా (Tesla) ప్రతిపాదన ఆధారంగా, దేశంలో తమ వాహనాల్లో కనీసం 40% తయారీకి కట్టుబడి ఉన్న తయారీదారుల వాహనాల దిగుమతి ఛార్జీలను ప్రభుత్వం తగ్గించవచ్చు. అంటే మన దేశంలో తమ వాహనాన్ని(Electric Vehicles) తీసుకురావాలంటే, కనీసం 40 శాతం వాహనాన్ని ఇక్కడే తయారు చేయాల్సి ఉంటుంది. 

వచ్చేవారం మస్క్‌తో కేంద్ర మంత్రి గోయల్‌ భేటీ..
తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) అమెరికాకు చెందిన వ్యాపారవేత్త ఎలోన్‌ మస్క్‌తో (Elon Musk) భేటీ కావచ్చని వార్తలు వచ్చాయి. ఈ సమావేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ 'టెస్లా' భారత్‌లోకి ప్రవేశించడంపై చర్చ జరగనుంది. మస్క్ గోయల్‌ల మధ్య అమెరికాలో జరగనున్న సమావేశంలో భారతదేశంలో ఫ్యాక్టరీని స్థాపించాలనే టెస్లా ప్రణాళికపై దృష్టి కేంద్రీకరించబోతున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

దీనితో పాటు, భారతదేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై కూడా చర్చ జరగవచ్చు. భారత్‌లో రూపొందుతున్న కొత్త విధానాలపై కూడా సమావేశంలో చర్చించవచ్చని నివేదికలో పేర్కొన్నారు.

Also Read: ప్రమాదం జరగబోతుందని డ్రైవర్ ను హెచ్చరించే వ్యవస్థ..త్వరలో 

జనవరి 2024లో అనుమతి..
జనవరి 2024 నాటికి భారతదేశంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం టెస్లాకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ శాఖ శరవేగంగా కసరత్తు చేస్తోంది.

ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇందులో టెస్లా పెట్టుబడి ప్రతిపాదనతోపాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ తదుపరి దశపై కూడా చర్చించారు.

టెస్లా బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ 

ఎలోన్ మస్క్ EV తయారీ సంస్థ టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను తయారు చేసి విక్రయించాలనుకుంటోంది. ఇందుకోసం భారత అధికారులకు కంపెనీ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనల్లో దిగుమతి సుంకాన్ని కనీసం 15% తగ్గించాలని డిమాండ్ వారు చేశారు.

ప్రస్తుతం $40,000 (సుమారు రూ. 32.5 లక్షలు) కంటే తక్కువ ధర కలిగిన కార్లకు 70% అంతకంటే ఎక్కువ ధర కలిగిన కార్లకు 100% కస్టమ్ డ్యూటీని భారత్ లో విధిస్తున్నారు. అందువల్ల విదేశీ కార్లను ఇక్కడ డబుల్ ఖరీదుగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కార్లపై కస్టమ్ డ్యూటీని తగ్గించడం.. విదేశీ కార్లను చౌకగా మన దేశంలో అందుబాటులోకి తీసుకువస్తుంది. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు