Telangana : రైతుబీమా నిధుల్లో గోల్ మాల్.. భారీగా నొక్కేస్తున్న 'ఏఈవో'లు!

తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా నిధుల్లో వరుస అవినీతి బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఏఈవో, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఏఈవో బలిగేర దివ్య తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భారీ సొమ్ము దోచేశారు. దివ్యను కలెక్టర్ సస్పెండ్ చేశారు.

New Update
Telangana : రైతుబీమా నిధుల్లో గోల్ మాల్.. భారీగా నొక్కేస్తున్న 'ఏఈవో'లు!

RYTHU BIMA : రంగారెడ్డి జిల్లా(Rangareddy District) కు చెందిన రైతుబంధు(Rythu Bandhu) నిధుల్లో గోల్ మాల్ జరిగింది. రైతుల ఖాతాల్లో పడాల్సిన డబ్బులను ఓ వ్యవసాయ విస్తరణాధికారి దారి మళ్లించారు. రైతుబీమా(Rythu Bima) క్లెయిమ్‌ చేసే సమయంలో నామినీ వివరాలు, తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి రూ.2 కోట్లకు పైగా రైతుల సొమ్ము దోచేశారు. అయితే పలువురు తమకు రైతుబంధు పడడం లేదన్న ఫిర్యాదుతో పాటు ఎల్ ఐసీ క్లెయిమ్ చేసే క్రమంలో అసలు విషయం బయటపడింది.

బతికున్న చనిపోయినట్లు చూపించి..
ఈ మేరకు 2020 నుంచి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 20 మంది బతికున్న అన్నదాతలను చనిపోయినట్లు చూపించి, 130 మంది రైతుబంధు డబ్బులు నొక్కేసినట్లు విచారణలో తేలింది. అలాగే రైతు బీమా కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్​ఐసీ చెల్లిస్తుండగా.. ఆ క్లెయిమ్​ ల చెల్లింపులకు సంబంధించి ఎల్​ఐసీ(LIC) ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఆ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రూ.కోటికి పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ఆ విషయంపై ముంబై(Mumbai) లోని ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉన్నతాధికారుల కళ్లు గప్పి..
ఈ క్రమంలోనే ఉన్నతాధికారుల కళ్లు గప్పి ఏఈవో(AEO) ఆ నిధులు స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మొత్తం రూ.2 కోట్లు కొట్టేసిన వ్యవహారంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలడంతో  సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కొందుర్గు మండలం పరిధిలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను విచారించినట్లు తెలుస్తోంది.  ఆ తతంగం వెనక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో దివ్య..
అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా రైతుబంధు డబ్బుల్లో అవినీతి జరిగింది. 64మంది రైతుల పెట్టుబడి సాయాన్ని గట్టు మండలం ఏఈవో బలిగేర దివ్య నొక్కేసినట్లు అధికారులు తెలిపారు. 2018 నుంచి రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన సొమ్ము ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు బయటపెట్టారు. మొత్తం రూ.36 లక్షల పెట్టుబడి సాయాన్ని కాజేసిందని, రైతుబంధు పడడం లేదన్న ఫిర్యాదుతో వెలుగులోకి ఈ వ్యవహారం బయటకొచ్చింది. రైతుల ఖాతాలకు బదులు ఉద్దేశపూర్వకంగా ఇతర ఖాతా నెంబర్‌లకు అప్‌లోడ్‌ చేయడంతో 64 మంది రైతులకు అన్యాయం జరిగింది. అయితే దీనిపై రైతు అహ్మద్ అనే వ్యక్తి అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. 64 మంది రైతుల పెట్టుబడి సాయాన్ని ఇతర ఖాతాలకు మళ్లించినట్లు రుజువు కావడంతో దివ్యను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్ చేశారు.

Also Read : మీకు బైక్ ఉందా? అయితే ఆ స్కీం కట్.. మీరు ఆ లిస్టులో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.!

Advertisment
Advertisment
తాజా కథనాలు