Modi : మోడీ మరో గ్యారంటీ.. ఇకపై వాళ్లను బయట ఉండనివ్వనంటూ సంచలన వ్యాఖ్యలు!

దేశంలో ఎన్నికల వేళ ప్రధాని మోడీ ప్రజలకు మరో గ్యారంటీ ఇచ్చారు. జూన్ 4 తర్వాత మరోసారి తమ ప్రభుత్వం ఏర్పడగానే అవినీతిపరులందరినీ జైలుకు పంపిస్తామన్నారు. అవినీతిపరులను బయట ఉండనివ్వను. పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
PM Modi: అందుకు కట్టుబడి ఉన్నాం.. తెలంగాణ ప్రజలకు మోదీ విషెస్

PM Modi : సార్వత్రిక ఎన్నికల (General Elections) వేళ ప్రధాని మోడీ దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇచ్చారు. ఇకపై అవినీతిపరులను (Corrupt People) బయట ఉండనివ్వనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. ‘మరో గ్యారంటీ ఇస్తున్నా. నేను ఇప్పుడు చెబుతున్నా. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అనంతరం అవినీతిపరులు తమ పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది. అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : KA పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఏం చేశారంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు