Watch Video: కార్పొరేట్ ఉద్యోగమా లేక పానీ పూరి అమ్ముకోవడమా.. వైరలవుతున్న వీడియో

కార్పొరేట్ ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకున్న పని. రాత్రి పగలు తేడా లేకుండా పని చేయాల్సి ఉంటుంది. ఇందులో పనిచేసే చాలామంది ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. కార్పొరేట్ ఉద్యోగం కన్నా.. పానీపూరి అమ్ముకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్లుగా ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నరీతిలో స్పందిస్తున్నారు. మరికొందకు ఇది ఒక విషాదకర పరిస్థితి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

New Update
Watch Video: కార్పొరేట్ ఉద్యోగమా లేక పానీ పూరి అమ్ముకోవడమా.. వైరలవుతున్న వీడియో

కార్పొరేట్ ఉద్యోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయడం.. నిబంధనలు పాటించకుండానే గంటలకొద్ది పని చేయాల్సి ఉంటుంది. అలాగే మనవల్ల ఏదైన చిన్న పొరపాటు జరిగినా కూడా పైస్థాయి అధికారులు తిడితే పడాల్సి ఉంటుంది. అందుకే చాలామంది కార్పొరెట్ లేదా టెకీ ఉద్యోంగలో పనిచేసేవారు పని ఒత్తిడని ఎదుర్కొంటారు. ఇలాంటి సవాళ్లతో కూడుకున్న ఉద్యోగం చేయడం కత్తి మీద సాము లాంటిందే. అయితే జీవితం గడవాలి.. సంపాదన కావాలనే ఆలోచనతో వాటిని తట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవిషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో లేఆఫ్స్ కూడా పెరిగిపోవడం ఉద్యోగులను మరింతగా వేధింపులకు గురిచేస్తోంది. ఆర్థికమాంద్యం రావడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు చాలా కార్పొరేట్ కంపెనీలు, ఐటీ దిగ్గజాలు వేలాది ఉద్యోగాలు తీసేశాయి. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీన్ని యూట్యూబ్‌లో పోస్టు చేసిన మూడు రోజుల్లోనే 20.3 లక్షలకు పైగా వ్యూస్ రావడం మరో విశేషం. ప్రముఖ పారిశ్రమికవేత్త అయిన హర్షగెయెంకాను కూడా ఈ వీడియో ఆకర్షించింది. అంతేకాదు ఆయన కూడా ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.

Also Read: ఈ కుక్కకు మంత్ర శక్తులున్నాయా ఏంటీ.. వామ్మో ఇలా చేసిందేంటి!

కార్పొరేట్ ఉద్యోగం కన్నా.. పానీపూరి అమ్ముకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్లుగా ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నరీతిలో స్పందిస్తున్నారు. మరికొందకు ఇది ఒక విషాదకర పరిస్థితి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మధ్యతరగతి వాళ్లతో పోల్చుకుంటే.. దిగువ మధ్యతరగతి ప్రజలే ధనవంతులని.. ఎందుకంటే వాళ్లు తక్కువగా ఖర్చులు చేసి.. ఎక్కవగా పొదుపు చేస్తారని మరొకరు రాసుకొచ్చారు. మరో యూజర్ ఇందుకు భిన్నంగా స్పందించారు. పానీపూరి వ్యాపారం చేసుకునే వారు ఎక్కవ సంపాదించినప్పటికీ కూడా కార్పొరెట్ ఉద్యోగికే గౌరవం లభిస్తుందని అన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమని.. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారికి సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతవరణంలో పని ఉంటుంది. ఉద్యోగ భద్రత ఉంటుంది. సమయానికి జీతం రావడం, ఆరోగ్య బీమా, పదవీ విరమణ లాంటి ప్రణాళికలు ఉంటాయని పేర్కొన్నాడు. అలాగే కార్పొరేట్ ఉద్యోగులు తమ ఉద్యోగంలో మరింత పైకి ఎదిగే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతమంది గొప్ప వ్యక్తులు, ఇతర నిపుణలతో కలిసి పనిచేయడం లేదా ఓ మంచి కంపెనీలో పనిచేయడం తృప్తినిస్తుందని తెలిపాడు. ఏది మంచో.. ఏది చెడో అనే విషయం వ్యక్తుల ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుందంటూ స్పష్టం చేశారు. అయితే మీరు కూడా ఓసారి ఈ వీడియోను చూసేయ్యండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు