Corona Virus: కరోనా జేఎన్.1 వైరస్.. టెన్షన్ అక్కరలేదు

దేశంలో కరోనా జేఎన్ 1 వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు కీలక సూచనలు చేస్తున్నారు. కొత్త వైరస్ ప్రభావం ఎక్కువగా చూపదని.. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Corona Virus: కరోనా జేఎన్.1 వైరస్.. టెన్షన్ అక్కరలేదు
New Update

Covid Variant JN.1 Virus: కొత్త కొవిడ్ (జేఎన్.1) వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ ఎక్స్పర్ట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేఎన్ 1 వేరియంట్ తో ఎలాంటి తీవ్రమైన సమస్యలు ఉండవని చెబుతున్నారు. ఈ వైరస్ ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించకుండా వచ్చి పోతుంటే, మరి కొందరిలో 'కామన్ వైరల్ ఫీవర్' తరహాలో లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అతి తక్కువ మందిలో జలుబు, ముక్కుకారడం, ఒళ్లు నొప్పులు లైట్ ఫీవర్ వంటి లక్షణాలు బయటపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని నెలల కిందే ఈ వేరియంట్ను గుర్తించగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క పేషెంట్ కు కూడా బ్రీతింగ్ సమస్య రాలేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

ALSO READ: దేశంలో బారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే ఏకంగా..

వైరస్ స్వభావం మార్చుకోవడంలో కొంత కేసుల వ్యాప్తి ఉన్నప్పటికీ, భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులు పేర్కొన్నారు. జేఎన్ 1 వేరియంట్ వెరీ వీక్ గా ఉందని.. దాని ప్రభావం ఎక్కువ ఉండదని తెలిపారు. ఇప్పటికే కొవిడ్ జేఎన్1 ప్రభావం తక్కువేనని డబ్ల్యూహెచ్ తో పాటు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కూడా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి చెందగా, మన దేశంలో కేరళలో (Kerala) ఫస్ట్ కేసులు తేలాయి. గత నెల 18వ తేదీన అక్కడ కేసులు తేలినా.. ప్రభావం లేదని గుర్తించారు. గోవా, మహరాష్ట్రలో కేసులు తేలుతుండగా, మన దగ్గర ఇప్పటి వరకు అధికారికంగా జేఎన్ 1 కేసులు తేలలేదు.

ALSO READ: విడాకులు తీసుకుని మళ్లీ కలిశారు.. బాబు-పవన్‌పై మంత్రి బొత్స పంచ్‌లే పంచ్‌లు..

ఈ లక్షణాలు ఉంటే తస్మాత్ జాగ్రత్త!

గతంలో పోల్చితే ప్రస్తుతం మార్కెట్లో కరోనా వైరస్ (Corona Virus) ను మ్యూటేషన్లతో సంబంధం లేకుండా తీవ్రతను అడ్డుకునే యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో వందకు వంద శాతం కరోనా ఎన్ని మ్యూటేషన్లు పొంది వ్యాప్తి చెందినా, సులువుగా అడ్డుకోవచ్చని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. జేఎన్1 (JN.1 Virus) వేరియంట్ లో కనిపిస్తున్న జలుబు, ముక్కుకా రడం, బాడీ పెయిన్స్, ఫీవర్ కు రెగ్యులర్ గా వాడే మందుల చికిత్స సరిపోతుందని వెల్లడి స్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని చెబుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

#telugu-news #corona-virus #jn-1-covid-variant #corona-tips #jn-1-virus
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe