Corona Heart Attacks: కరోనాకు, గుండెపోటుకు లింక్‌! కేంద్రం సంచలన ప్రకటన..!

New Update
Corona Heart Attacks: కరోనాకు, గుండెపోటుకు లింక్‌! కేంద్రం సంచలన ప్రకటన..!

మీరు కరోనా బాధితులా?..
'ఆ అవును..'

అయితే ఈ షాకింగ్‌ న్యూస్‌ మీ కోసమే. ఎప్పుడో సోకిందిలే.. కరోనా గోల మళ్లీ ఇప్పుడెందుకులే అని లైట్‌ తీసుకుంటున్నారా? కరోనాకు గుండెపోటుకు లింక్ ఉందని తెలుసా? ఇదేదో గాలిమాటో, నోటిమాటో కాదు.. సాక్ష్యాత్తు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చేసిన హెచ్చరిక. ఇదేంటి కరోనాకు గుండెపోటుకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? భయం వేస్తోందా? అయితే.. కూల్‌.. కూల్‌.. ఏం భయపడొద్దు.. మీకేమీ కాదు.. కేంద్ర ఆరోగ్యశాఖ ఏం చెప్పిందో తెలుసుకుంటే సరిపోతుంది. మీ చిట్టి గుండె భద్రంగా ఉంటుంది. ఇంతకి కేంద్రం ఏం చెప్పింది.?ఇటివల యువకుల్లో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు, కరోనా ఇన్‌ఫెక్షన్‌కు లింకేంటో తెలుసుకోండి.

కోలుకున్నా వదలడం లేదు:
కరోనా.. ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు.. మూడేళ్లు ప్రపంచాన్ని, దేశాన్ని పట్టి పీడించిన మహమ్మారి ఇది. ఇప్పుడు కూడా కరోనా కేసులు రికార్డవుతూనే ఉన్నాయి. అయితే మునపటిలా వైరస్‌ విజృంభించడంలేదు. శాంతించింది. అందుకే ప్రజలు కూడా కరోనాను పట్టించుకోవడం మానేశారు. అటు కరోనా సోకి.. వైరస్‌ నుంచి కోలుకున్న వారు తమ పనుల్లో బిజీ ఐపోయారు. మరోవైపు ఇటివల కాలంలో తక్కువ వయసులోనే గుండెపోటు వచ్చి చనిపోతున్న వారి సంఖ్య పెరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ గుండెపోటుతో యువకులు ప్రాణాలు విడిచారు.


జిమ్‌ చేస్తూ హార్ట్ అటాక్‌:
డ్యాన్స్‌ చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలడం, క్రికెట్ ఆడుతూ సడన్‌ హర్ట్‌ అటాక్‌తో ప్రాణాలు విడవడం, ముఖ్యంగా జిమ్‌ చేస్తూ గుండెపోటుతో చనిపోవడం లాంటి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చనిపోతున్న వాళ్లలో ఎక్కువ మంది 40ఏళ్లలోపు వారే ఉండడం బాధకారం. కొంతమంది టీనేజర్లు సైతం ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఏకంగా స్కూల్‌ విద్యార్థులే ఈ లిస్ట్‌లో ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా రికార్డ్‌ అవుతున్న కేసులు 'జిమ్‌'తో ముడిపడి ఉన్నాయి. వర్క్‌ అవుట్స్‌ చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలడం, స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు అనేకం. డాక్టర్లు ఈ విషయంలో అనేక సూచనలు చేస్తున్నప్పటికీ కారణాలు మాత్రం పక్కాగా చెప్పలేపోతున్నారు.


కేంద్రం ఏం చెబుతోంది:
ఈ మధ్య కాలంలో గుజరాత్‌లో గర్బా(డ్యాన్స్‌) చేస్తూ గుండెపోటుకు గురవుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. నవరాత్రుల్లో భాగంగా గర్బా అన్నది గుజరాత్‌ ప్రజలు ఫాలో అయ్యే సంప్రదాయం. ఈ అక్టోబర్ 22న కపద్వాంజ్ ఖేడా జిల్లాలో గర్బా ఆడుతున్నప్పుడు అకస్మాత్తుగా 17ఏళ్ల టీనేజర్‌కు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా పెరగడంతో కేంద్రం స్పందించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ మరణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు కనీసం ఒకటి లేదా రెండేళ్ల పాటు కఠినమైన వ్యాయామాలు చేయవద్దని మాండవియా సూచించారు. ఐసీఎంఆర్‌ స్టడీ విషయాలను ప్రస్తావిస్తూ మాండవియా ఈ సజెషన్స్‌ చేశారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌, గుండెపాటు మరణాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనం చేస్తోంది. తీవ్రమైన కరోనా ఇన్‌ఫెక్షన్‌తో బాధపడిన వారు కొంతకాలం ఓవర్‌గా వర్క్‌ అవుట్స్‌ చేయకూడదని గతంలోనే సూచించింది.

ఇండియాలోనే కాదు:
ఇటు ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ ఇతే పరిస్థితి కనిపిస్తోంది. 25-44 ఏళ్ల మధ్య వారిలో గుండెపోటు కేసులు దాదాపు అన్నిదేశాల్లో పెరుగుతున్నాయి. అమెరికాలో మహమ్మారికి ముందు సంవత్సరంలో 1,43,787 మంది గుండెపోటు మరణాలు సంభవించాయి. మహమ్మారి మొదటి సంవత్సరంలో ఈ సంఖ్య 14శాతం పెరిగి 1,64,096కి చేరుకుంది. ఇటు ఇండియాలో యుక్త వయసులో గుండెపోటు బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కేంద్రం ఏం చెప్పినట్లు కరోన్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు కనీసం రెండేళ్లు తీవ్రమైన వ్యాయమాలకు దూరంగా ఉంటే ఎలాంటి ముప్పు ఉండదని డాక్టర్లు సూచిస్తున్నారు.

Also Read: చేపలు తింటే మతిమరుపు మాయం..ఇంకా ఎన్నో లాభాలు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు