దేశంలోకి కరోనా కొత్త సబ్ వేరియంట్.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

మరోసారి కరోన కొత్త వేరియంట్ ప్రజలను కలవరపెడుతోంది. జేఎన్ 1 అనే కరోనా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనాకు చెందిన 'జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ' అధికారులు తాజాగా వెల్లడించారు. ఇప్పటికే 7కేసులు నమోదైనట్లు తెలిపారు.

దేశంలోకి కరోనా కొత్త సబ్ వేరియంట్.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
New Update

COVID Subvariant JN.1 in Kerala: చైనాలో మరోసారి కరోనా (Corona Virus) కల్లోల్లం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది మరణించగా చాలా దేశాలు నష్టం చేకూరుంది. అయితే తాజాగా జేఎన్ 1 (JN.1) అనే కరోనా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనాకు చెందిన 'జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ' అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఈ వైరల్ కారణంగా ఇప్పటివరకూ ఏడు కేసులు దొరికాయని, మరిన్ని పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో చైనా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బీజింగ్ నగరంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు భయంతో మళ్లీ మాస్కులు ధరించి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి :ఏపీ దేవాదాయ శాఖలో 70 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ఈ మేరకు'యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' అధికారులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ జేఎన్ 1కు బీఏ 2.86 సబ్ వేరియంట్ లకు దగ్గరి సంబంధం ఉందని వెల్లడించారు. ఈ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి పెరగవచ్చని, స్పైక్ ప్రోటీన్‌లో జేఎన్.1,బీఏ.2.86 మధ్య ఒకే ఒక్క మార్పు ఉందని వైద్యాధికారులు తెలిపారు. జేఎన్ 1 సబ్ వేరియంట్ ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదం కలిగిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్యాధికారులు చెబుతున్నారు. జేఎన్1 సబ్ వేరియంట్ మొదటిసారి యునైటెడ్ స్టేట్స్ (United States) లో కనుగొనగా కొత్త కరోనావైరస్ వేరియంట్ మొదటిసారిగా డిసెంబర్ 13వతేదీన కేరళ (Kerala) రాష్ట్రంలో కనుగొన్నట్లు తెలిపారు. ఇక భారతదేశంలోనూ ఇటీవల కొవిడ్ కేసుల సంఖ్య 1296 కు చేరడానికి జేఎన్ 1 కారణమని నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ (Rajeev Jayadevan) వెల్లడించారు. అయితే ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ఇప్పటినుంచే తగు జాగ్రత్తలు తీసుకునేందుకు వైద్యాధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

#corona-virus #new-sub-varian #jn-1-covid-variant #kerala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe