India Corona Bulletin: దేశంలో కరోనా జేఎన్.1 కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. రోజుర్జుకు కరోనా వైరస్ భారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరిన విషయం తెలిసిందే. తాజాగా రోజువారీ కరోనా కేసుల నమోదు సంఖ్య 800 లకు టచ్ అయ్యేలా ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 798 కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక నిన్న(గురువారం) ఒక్కరోజే కరోనా దాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పయినట్టు పేర్కొంది. ఈ వైరస్ కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు ప్రకటించింది.
ALSO READ: గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ
తెలుగు రాష్ట్రలో కరోనా కేసులు ఇలా...
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో కూడా కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తుంది. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 25 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీంతో ఏపీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 54కు చేరింది. అలాగే తెలంగాణలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యశాఖ పేర్కొంది. తెలంగాణ ప్రస్తుతం 64 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 మొదటి కేసు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఎక్కువ శాతం కరోనా కేసులు కేరళ రాష్ట్రం లోనే నమోదు అవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశ ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి తో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తెలిపారు. దీని వ్యాప్తి వేగంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు.
ALSO READ: సీఎం జగన్ కు ఎమ్మెల్సీ వంశీ సంచలన లేఖ