Corona Cases: దేశంలో 3 వేలు దాటిన కరోనా కేసులు.. తెలుగు రాష్ట్రాలకు హైఅలెర్ట్!

ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏపీలో నిన్న నాలుగు కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఒకేరోజు 9 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. మాస్కులు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

New Update
Corona Cases: దేశంలో 3 వేలు దాటిన కరోనా కేసులు.. తెలుగు రాష్ట్రాలకు హైఅలెర్ట్!

AP & TS High Alert: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ స‌బ్ వేరియంట్ జేఎన్.1 కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3వేలకు చేరుకుంది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన ఆరోగ్యశాఖ సూచిస్తోంది. అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని డబ్లూహెచ్ ఓ తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో కరోనా మరణాల రేటు 1.18గా ఉంది. కానీ ఒకే రోజు ఆరుగురు చనిపోవడం మాత్రం ఆందోళన కలిగించే విషయమని వైద్యాధికారులు చెబుతున్నారు.

ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వీరికే కొత్త రేషన్ కార్డులు!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా అలజడి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి కరోనా కొత్త వేరియంట్ కలవరపెడుతోంది. ఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ అలెర్ట్ అయింది. ఏపీలో 4 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఏలూరు-1, వైజాగ్‌-3 కేసులో నమోదు అయినట్లు పేర్కొంది. JN-1 నిర్ధారణకు జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షలకు శాంపిల్స్ పంపారు వైద్యులు. పీపీఈ కిట్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. నిన్న కోవిడ్ వ్యాప్తిపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ టెస్టులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 56,741 ఆక్సిజన్‌ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

ALSO READ: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన

తెలంగాణలో ఒకేరోజు 9 కరోనా కేసులు..

తెలంగాణలో నిన్న (శుక్రవారం) ఒకేరోజు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 27కి చేరింది. గత 24 గంటల్లో 1,245 శాంపిల్స్‌ పరిశీలించగా.. 9 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు తెలిపింది. ఇంకా 68 మంది రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అందరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను హెచ్చరించింది.

దేశంలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే?

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 423 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా కేరళలో 266 కేసులు నమోదు అయినట్లు పేర్కొంది. కరోనా దాటికి నాలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దేశం ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి చేరింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు