America : హైపోథర్మియాతోనే చనిపోయాడు..భారత విద్యార్ధి మృతికి కారణాలు

గత నెల 20న అమెరికాలో చనిపోయిన భారత సంతతి విద్యార్ధి అకుల్ ధావన్ మృతికి కారణాలను ప్రకటించింది ఇల్లినాయిస్‌ ఛాంపియన్ కౌంటీ కార్నర్స్‌ ఆఫీస్‌. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం... దానికి తోడు విపరీతమేన చలి కారణంగా అకుల్‌ హైపోథర్మియా బారిన పడ్డాడని తేల్చింది.

America : హైపోథర్మియాతోనే చనిపోయాడు..భారత విద్యార్ధి మృతికి కారణాలు
New Update

Indian Origin Student Akul Dhavan : మధ్య కాలంలో అమెరికా(America) లో వరుస భారతీయుల మరణాలు ఆందోళన కలిగించాయి. అందులో భారత విద్యార్ధి(Indian Student) అకుల్ ధావన్(Akul Dhavan) మృతి ఒకటి. ఇతను భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. జనవరి 20న తన ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్ళిన అకుల్ కొంతసేపటి తర్వాత కనిపించలేదు. తరువాత తన హాస్టల్ బయటనే చనిపోయి కనిపించాడు. అకుల్ మృతికి సరైన కారణాలు అప్పుడు తెలియలేదు. క్యాబ్ డ్రైవర్ అయి ఉండవచ్చని అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు అకుల్ చనిపోవడానికి గల కారణాలను ఇల్లినాయిస్ యూనివర్శిటీ(Illinois University) ప్రకటించింది.

అది హైపోథర్మియానే...

జనవరి 20 అకుల్ తన ఫ్రెండ్స్‌తో కలిసి క్యాంపస్‌కు దగ్గర లోనే ఉన్న కెనోపి క్లబ్‌(Canopy Club) కు వెళ్ళాడు. అక్కడ క్లబ్‌లోకి అతనిని రానివ్వలేదు. చాలాసార్లు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ... బయట సెక్యురిటీ గార్డులు అనుమతించలేదు. తరువాత క్యాబ్‌ కూడా బుక్ చేసి పంపిద్దామని చూశారు. కానీ అకుల్ అక్కడినుంచి వెళ్ళడానికి నిరాకరించాడు. తరువాత కొద్ది సేపటికి అతనంతట అతనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన కొన్ని గంటలకే మృతి చెందినట్లు కనుగొన్నారు. అయితే క్లబ్‌కు వెళ్ళేటప్పటికే అకుల్ బాగా మద్యం సేవించి ఉన్నాడు. దాంతో పాటూ జనవరి నెలలో ఇల్లినాయిస్ ఉష్ణోగ్రతలు -30 డిగ్రీలు ఉంది. అంత చలిలో...విపీతంగా యద్యం సేవించి అకుల్ ఎక్కువ సేపు ఉండడం వల్ల అతను హైపోథెర్మియా(Hypothermia) కు గురయ్యాడని ఇల్లినాయిస్ యూనివర్శిటీ తెలిపింది. దాని కారణంగానే అకుల్ మృతి చెందాడని చెబుతోంది.

క్లబ్‌లోకి అనుమతినివ్వకపోవడంతో అకల్ క్లబ్ దగ్గర నుంచి వెళ్ళిపోయాడని..తరువాత స్నేహితులు అతణ్ని సంప్రదించేందుకు ఎంత ప్రయత్నించినా కుదరలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో వారిలో ఒకరు తమకు ఫిర్యాదు చేశారని అన్నారు. అప్పుడు గాలింపు చర్యలు చేపట్టగా...కొన్ని గంటల వ్యవధిలో అకుల్ మృతదేహం కనపడిందని చెప్పుకొచ్చారు. క్యాంపస్ బయట పొదల్లో అకుల్ బాడీని కనుగొన్నారు.

Also Read : Andhra Pradesh : మాజీ సీఎస్ జన్నత్ హుస్సేన్ కన్నుమూత

#student #usa #america #indian-origine #akul-dhavan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe