సోషల్‌మీడియా(Social Media) కల్చర్ తెలియనది కాదు.. ఏదైనా ఒక ఆసక్తికర ఫొటో దొరికిందంటే చాలు దాన్ని మీమ్(Meme) మెటిరీయల్‌గా మార్చేయడం మీమర్స్ స్పెషాలిటీ. అందుకు ప్రధాని అయినా సామాన్యుడైనా ఎవరైనా అతీతులు కాదు. ఇక ప్రధాని మోదీ(Narendra Modi) కొన్ని సందర్భాల్లో చాలా ఫన్నీగా ఉంటారు. ఆయనపై వేసే జోకులను కూడా స్పోరిటీవ్‌గా తీసుకుంటారు. చాలా మంది మీమర్స్‌కి మోదీనే మంచి మెటిరీయల్ ఆయన చేసే ప్రసంగాలు, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చాలా సందర్భాల్లో మీమ్స్‌కి యూజ్ చేసుకుంటారు నెటిజన్లు. మరోసారి అదే జరిగింది. అయితే ఈసారి ఇటలీ ప్రధాని సోషల్‌మీడియాలో లక్షల పోస్టులకు కారణం అయ్యారు. ఆమె పెట్టిన ఓ పోస్టు, దానికి ఇచ్చిన క్యాప్షన్ వావ్ అనిపించేలా ఉంది.
హ్యాష్ ట్యాగ్ అదుర్స్:
ఇటలి ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni) మరోసారి ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్నారు.
మోదీతో దిగిన సెల్ఫీని మేం మంచి ఫ్రెండ్స్ అంటూ 'Melodi' అని హ్యాష్‌ట్యాగ్ ఇవ్వడం.. ఆ మెలోడి కాస్త క్షణాల్లో వైరల్ అవ్వడం చకాచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్ అవుతోంది.
మెలోడి హ్యాష్ ట్యాగ్ తో లక్షకు పైగా ట్వీట్లు వెల్లువెత్తాయి. అటు మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఫన్నీగా ట్వీట్లు పెడుతున్నారు. మోదీ అందరి అమ్మాయిలకు నమస్కరిస్తారని.. మెలోనికి మాత్రం షేక్‌హ్యాండ్ ఇస్తారంటూ వీడియో ప్రూఫ్స్‌తో సరదాగా ట్వీట్లు చేస్తున్నారు. ఇద్దరూ ఒకే ఫోన్ వాడుతున్నారని..ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నారని.. మ్యాచింగ్.. మ్యాచింగ్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇద్దరూ ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఒకసారి ఆ మీమ్స్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.
ఇద్దరూ మంచి ఫ్రెండ్స్:
COP28 సమ్మిట్ సందర్భంగా దుబాయ్‌లో మోదీ-మెలోని మీట్ అయ్యారు. ఈ సందర్భంగానే సెల్ఫీ దిగారు. మెలోని ఏజ్ 46. అటు మోదీ కూడా మెలోనితో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. '#COP28 సమ్మిట్ సందర్భంగా ఇటలీ ప్రధాని @GiorgiaMeloniని కలిశారు. సుస్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం దేశం, ఇటలీల మధ్య సహకార ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నాను' అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. COP28 సమ్మిట్ UAE ప్రెసిడెన్సీలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరుకు జరుగుతోంది. ఈ సమ్మిట్‌లో భాగంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, స్వీడిష్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, బార్బడోస్ కౌంటర్ మియా అమోర్ మోట్లీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, యూకే పీఎం రిషి సునక్ తదితర నేతలతోనూ మోదీ సమావేశమయ్యారు.
Also Read: జస్ట్ మిస్..లేకపోతే అంపైర్ అవుట్..జితేష్ స్ట్రోక్ అలాంటిది మరి!