/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/seeds-jpg.webp)
Fenugreek : మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి(Life Style) కారణంగా ప్రజల్లో మధుమేహం(Diabetes) బాధితులు ఎక్కువవుతున్నారు. ఓ నివేదిక ప్రకారం భారత్(India) లో ప్రతి 10 మందిలో 8 మంది మధుమేహంతో బాధపడుతున్నారు. డయాబెటిస్ సమస్య జీవనశైలికి సంబంధించిన వ్యాధి. దీనికి శాశ్వత నివారణ లేదు. దీనిని కేవలం నియంత్రించవచ్చు.
డయాబెటిక్ రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయి(Sugar Levels) ని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. లేకుంటే వారు ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు. దానిని నియంత్రించడానికి ఇంటి నివారణలను కూడా ప్రయత్నించవచ్చు. మెంతులు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.
మెంతి గింజలు ఎలా ప్రభావవంతంగా ఉంటాయి?
మెంతులలో(Fenugreek) ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కార్బోహైడ్రేట్లను గ్రహించడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, మెంతులు శరీరంలో ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతాయి, కాబట్టి మధుమేహ రోగులు దీనిని తీసుకోవాలి. టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడంలో మెంతి నీరు చాలా మేలు చేస్తుంది.
మెంతులు నెమ్మదిగా జీవక్రియను పెంచుతాయి.మెంతి నీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెంతి నీరు తాగడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అల్సర్ సమస్య, కడుపులో పుండు వంటి సమస్య ల నుంచి కూడా మెంతులు ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ సంజీవని మూలిక కడుపులో రాళ్లతో బాధపడేవారికి మంచిది. మెంతి టీ తాగడం వల్ల రాళ్ల సమస్యను దూరం చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి?
మెంతి గింజలను అర గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం పూట ఈ నీటిని ముందుగా తాగి తర్వాత మెంతి గింజలను నమిలి తినండి. కొన్ని రోజుల్లో మీరు దీని నుండి చాలా ప్రయోజనం పొందుతారు.
Also Read : రంజాన్ మాసంలో ఖర్జూరం పండుకు ఎందుకు అంత ప్రాముఖ్యతో తెలుసా!