Health Benefits: మలబద్ధకం వేధిస్తుందా..? ఈ డ్రింక్స్‌ను తాగి చూడండి చాలామంది ప్రస్తుతం మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మలవిసర్జన ప్రతిరోజు ఉదయం సాఫీగా ఉంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఒక్క పనీ విషయంతో పేగులు మొరాయిస్తే నరకంగానే ఉంటుంది. అయితే కొన్ని డ్రింక్స్ ద్వారా ఈ సమస్యను దూరం చేయవచ్చు. By Vijaya Nimma 18 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి మలబద్ధకం ఉంటే కడుపులో ఇబ్బంది, అసౌకర్యంతోపాటు మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం, పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ సమస్యకు ప్రధాన కారణం పీచుపదార్థాలు, ద్రవం, మందులు వాడటం, శారీరక శ్రమ లేకపోవడం, హార్మోన్ల మార్పులు, చెడు ఆహారల అలవాట్ల వల్ల మలబద్ధకం సమస్యలు వస్తాయి. మలబద్ధకం సమస్యను కొంతమంది సీరియస్‌గా తీసుకోరు. మలబద్ధకం సమస్య ముదిరితే.. పైల్స్, అధికబరువు, అలసట, బలహీనత వంటి అనారోగ్యాలు వస్తాయి. అయితే.. రాత్రి నిద్రపోయే ముందు కొన్ని డ్రింక్స్ తాగితే మలబద్ధకం లక్షణాలను దూరం చేయవచ్చు. మలబద్ధకం నుంచి ఉపశమనానికి ఫైబర్ రిచ్ డ్రింక్స్ బెస్ట్. ఇది పేగు కదలికలను మెరుగుపర్చడానికి మరియు మలాన్ని మృదువుగా చేయడానికి ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రంక్స్ వలన ఉపయోగాలు అల్లంలో ఉండే పోషకాలకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని రోజు తీసుకుంటే. జీర్ణక్రియ, వికారం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి. రోజు కొద్దిగా అల్లంటీ తాగితే సమస్య పోతుంది. సోంపు,చామంతి టీలని ఎప్పుడైనా తాగారా..? యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చామంతి టీలో పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని దూరం చేసి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. రాత్రి చామంతి టీని తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం వస్తుంది. మలబద్ధకం సమస్యకు నిమ్మరసం బెస్ట్ అని చెప్పాలి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండి రాత్రి తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా జీర్ణశయాంతర పేగు కండరాలు, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఒక గ్లాస్ నీళ్లలో పుదీనా ఆకులు వేసి మరిగించాలి. తర్వాత గోరువెచ్చగా తాగితే మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిలో నీటి శాతం ఎక్కువ జీర్ణమవడమే కాకుండా కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. రోజులో ఒక్కసారైనా బొప్పాయి స్మూతీ తాగితే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణాశయానికి ఉపశమనం కలిగిస్తాయి. గోరువెచ్చని నీళ్లలో పసుపు, నల్ల మిరియాలతో కలిపి రోజూ తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కలబంద రసాన్ని తాగడం వల్ల మలబద్ధకం సమస్యకు స్వస్తి చెప్పవచ్చు. మలబద్ధకానికి ప్రకృతి ఔషధంగా కలబంద రసం ఉపయోగపడతాయి. గమనిక: ఈ న్యూస్ కేవలం మీ అవగాహన కోసం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదిస్తే మంచిది. #health-benefits #tips #constipation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి