AP Crime: రాయచోటిలో కానిస్టేబుల్ ఆత్మహత్య...కారణాలపై పోలీసుల ఆరా

కడప నగరంలో చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తే హృదయం చలించిపోతుంది. ఒక ఘటన మరువకముందే మరొక ఘటన చోటు చేసుకుంటుంది. తాజాగా అనారోగ్య సమస్యతో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
AP Crime: రాయచోటిలో కానిస్టేబుల్ ఆత్మహత్య...కారణాలపై పోలీసుల ఆరా

అన్నమయ్య జిల్లా రాయచోటి డీసీబీఆర్ కార్యాలయంలో ఊరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసున్నాడు. వివరాల్లోకి వెళితే..2009 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్ రవిగా పోలీసులు గుర్తించారు. గత కొద్దీ కాలంగా అనారోగ్య బాధపడుతున్న రవి.. తీవ్ర మనస్థాపానికిలోనై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి రవి మృతదేహం తరలించారు పోలీసులు. అనంతరం రవి మృతదేహాన్ని స్వగ్రామమైన పోరుమామిళ్లకు తరలించే ఏర్పాట్లు చేశారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

వ్యక్తిగత కారణాలతో..

గత నెల కడపలో కానిస్టేబుల్ భార్యాపిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపిన విషయం తెలిసిందే. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీ కాల్చి చంప్పి.. ఆపై వెంకటేశ్వరులు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కడప టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్నారు. వెంకటేశ్వర్‌కు భార్య మాధవి, లాస్య , అభిజ్ఞ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే ఆయనకు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉండగా..ఆమెకు వీరికి ఓ కొడుకు ఉన్నాడు. ఈ ఘటన కడపలో కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: రొమ్ముల్లో క్యాన్సర్ కణతులు ఎలా గుర్తించాలి..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

సెప్టెబర్‌ 8న కర్నూలు జిల్లాలోని లోకాయుక్త కానిస్టేబుల్ ఆర్.సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. గన్ మిస్ ఫైర్ అయినట్లు పోలీసులు భావించారు. కర్నూలు జిల్లా లోకాయుక్త కార్యాలయంలో ఇటీవలే గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యం.. గతంలో కర్నూలు జిల్లా ఎస్పీ ఇతర అధికారులకు దగ్గర డ్రైవర్‌గా పనిచేశాడు. మృతుడికి భార్య అనురాధ, కూతురు పద్మనందిని, మౌనిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా అశోక్‌నగర్ లేబర్ కాలనీలో వీరి కుటుంబం నివాసం ఉంటుంది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ఒకదాని తర్వాత మరొకటి కానిస్టేబుల్ల ఆత్మహత్యలు ఏపీని కలిచివేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు