Constable: తీరని దుఃఖం.. ప్రభుత్వ లాంఛనాలతో గణేష్ అంత్యక్రియలు

ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకానికి బలైన ఏపీఎస్పీ కానిస్టేబుల్ గణేష్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అధికారులు అందజేశారు. గణేష్ వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి, ఆయన లేని లోటు తీరనిదంటూ నివాళి అర్పించారు.

New Update
Constable: తీరని దుఃఖం.. ప్రభుత్వ లాంఛనాలతో గణేష్ అంత్యక్రియలు

Annamaya: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో దాడికి గురై మృతి చెందిన కురుబ గణేష్ (Ganesh) అంత్యక్రియలను ధర్మవరం పట్టణంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ధర్మవరం పట్టణానికి చెందిన గణేష్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు, బలగాలు కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందజేశారు.

వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి..
అనంతరం గణేష్ మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లి రెండు రౌండ్లు కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. గణేష్ వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన లేని లోటు తమకు, తమ డిపార్ట్మెంట్ కు తీరనిదన్నారు. గణేష్ కుటుంబానికి అన్ని రకాల సాయం తాము చేయగలమని, కానీ మృతి చెందిన గణేష్ ని మాత్రం తిరిగి తేలేమని ఈ సందర్భంగా వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.

తీరని బాధను మిగిల్చింది..
అనంతరం గణేష్ తల్లి, భార్యలు మాట్లాడుతూ గణేష్ చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమకు తమ కుటుంబానికి అండగా నిలబడిన వ్యక్తి . అలాంటి వాడు దూరం కావడం తమకు తీరని బాధను మిగిల్చిందన్నారు. అతి చిన్న వయసులోనే గణేష్ అనంత లోకాలకు వెళ్లడంతో ఇంటి చుట్టుపక్కల వారు బంధుమిత్రులు దుఃఖంతో కన్నీరు మున్నీరై విలపించారు.

ఇది కూడా చదవండి : Hyderabad: సీనియర్ జర్నలిస్ట్ ఇంట్లో NIA సోదాలు..!

మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సాయం..
అలాగే మాజీ ఎమ్మెల్యేలు పార్థసారథి, గోనుగుంట్ల సూర్యనారాయణ, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి దైర్యం చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లను ఎదుర్కునే క్రమంలో కురుబ గణేష్ వీరమరణం పొందాడని ఈ సందర్భంగా వారు నివాళి అర్పించారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కురుబ గణేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం గణేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.స

Advertisment
తాజా కథనాలు