Lok Sabha : కాంగ్రెస్ పార్టీ (Congress Party) యూపీ (Uttar Pradesh) లోని అలహాబాద్ (Allahabad) లోక్ సభ స్థానాన్ని సుమారు 40 సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు గెలిచింది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బీజేపీ నుంచి నీరజ్ త్రిపాఠి, కాంగ్రెస్ నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్ పోటీ చేశారు. ఈ క్రమంలోనే ఉజ్వల్ బీజేపీ అభ్యర్థి పై సుమారు 58 వేల పై చిలుకు మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఉజ్వల్ సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత రేవతి రమణ్ సింగ్ కుమారుడు. ఉజ్వల్ గతంలో ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ములాయం సింగ్ యాదవ్ మంత్రివర్గంలో పని చేశారు. అయితే కొన్నిరోజుల క్రితం ఎస్పీని వీడి కాంగ్రెస్‌లో కి వచ్చారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా అలహాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు.
అలహాబాద్ నుంచి కాంగ్రెస్ చివరిసారి 1984లో గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ నుంచి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోటీ చేసి గెలిచారు. కానీ మూడేళ్లకే ఆయన రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరిగింది. నాటి నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీకి అలహాబాద్ అందని ద్రాక్షగానే ఉంది. 40 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆ స్థానాన్ని కాంగ్రెస్ అందుకుంది.
Also read: ఏపీలో తిరిగి ప్రారంభం అయిన అన్న క్యాంటీన్లు..ఎక్కడ,ఎవరు ప్రారంభించారంటే!