Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్...

గద్వాల అసెంబ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గద్వాల ఎంఎల్ఏ కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కృష్ణమోహన్ రెడ్డి కూడా దీనికి సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

New Update
Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్...

Congress Operation Akarsha: 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది.గతంలో 13 నియోజకవర్గాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించిన బీఆర్ఎస్ ప్రస్తుతం కేవలం 2 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయ్యింది. 2019 ఎన్నికల్లో గెలిచిన ఒక్క ఎంఎల్ఏ కూడా బీఆర్ఎస్‌లో చేరడంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయ్యి.. గులాబి కంచుకోటగా ఉమ్మడి పాలమూరు జిల్లా మారింది.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఫార్ములాను అనుసరిస్తోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలే BRS నుండి గెలుపొందడంతో వారిని సైతం కాంగ్రెస్ లోకి లాక్కునేందుకు సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పైగా ఇది సీఎం రేవంత్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మరింత బలపర్చేందుకు రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారు.అందుట్లో భాగంగానే ఎంఎల్ఏ లను పార్టీలో చేర్చుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసిన సాన్నిహిత్యంతో గద్వాల ఎంఎల్ఏ ను పార్టీలోకి తీసుకువచ్చేందుకు మంత్రి జూపల్లి పావులు కదుపుతున్నారు.

గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు కు ఉన్న సాన్నిహిత్యం తో అతడిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేసుకోవడం సులభంగా మారుతుందని తన అనుచరులు కూడా కాంగ్రెస్ లోకి మారాలని ఎంఎల్ఏ కృష్ణమోహన్ రెడ్డి పై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. చాలా రోజుల నుండి కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నప్పటికి కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.తన కార్యకర్తలతో చర్చించి మరో 2 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు..

కాగా ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డి తో సీఎం రేవంత్ రెడ్డి సైతం టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం.
దీంతో కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరేందుకు చేరేందుకు సన్నద్ధం అవుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.

Also Read:Cricket: చితక్కొట్టిన స్మృతి మంథాన..సౌత్‌ ఆఫ్రికా చిత్తు చిత్తు

Advertisment
తాజా కథనాలు