Revanth Reddy : జర ఆగు హన్మంతన్నా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇదే!

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపైనే నేరుగా వీహెచ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం నేరుగా రంగంలోకి దిగి వీహెచ్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. రానున్న రోజుల్లో మంచి అవకాశం కల్పిస్తానని వీహెచ్ కు రేవంత్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

New Update
Revanth Reddy : జర ఆగు హన్మంతన్నా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇదే!

Telangana : తెలంగాణ కాంగ్రెస్(Congress) సీనియర్ నేత వీ.హన్మంతరావు(V Hanumantha Rao) ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇతర పార్టీల నేతలను రేవంత్ స్వయంగా వెళ్లి ఆహ్వానించడం సరికాదని వీహెచ్ మండిపడ్డారు. స్థాయిని తగ్గించుకోవద్దంటూ సూచించారు. ఈ విషయం కలిసి చెబుదామంటే రేవంత్ సమయం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేతలు ఎంతటివారైనా పరిధి దాటి మాట్లాడితే వేటు తప్పదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వార్నింగ్ వీహెచ్ కే అన్న చర్చ కాంగ్రెస్ తో పాటు రాష్ట్ర రాజకీయవర్గాల్లో జోరుగా సాగింది.
ఇది కూడా చదవండి : BRS MLC Kavitha: కవితకు ఖైదీ నంబర్ 666.. డల్‌గా మొదటిరోజు

ఈ నేపథ్యంలో ఈ రోజు వీ హన్మంతరావు రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీహెచ్ చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకున్న రేవంత్.. వీహెచ్ ను తన వద్దకు తీసుకురావాలని మహేష్‌ కుమార్ గౌడ్ కు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహేష్‌ కుమార్ గౌడ్ తో కలిసి రేవంత్ ను వీహెచ్ కలిసినట్లు సమాచారం. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపై వీరి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఎంపీ టికెట్ ఆశించిన వీహెచ్.. వచ్చే అవకాశం రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయంపై నిరాశ చెందవద్దని రానున్న రోజుల్లో మంచి అవకాశం కల్పిస్తామని వీహెచ్ కు రేవంత్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీహెచ్ తో భేటీ కావడం ద్వారా అందరినీ కలుపుకుని పోవాలన్నదే తన ఆలోచన అన్న సంకేతాన్ని రేవంత్ మరోసారి ఇచ్చారని పార్టీలో చర్చ సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు