V. Hanumantha Rao: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య భట్టి నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. తాజాగా ఈ రేసులోకి కొత్త వ్యక్తి వచ్చారు. అదెవరో కాదు మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు. ఖమ్మం పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కొరకు గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఎంపీ టికెట్ ఇస్తుందనేది మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.
ALSO READ: సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
ఖమ్మం ఎంపీగా భట్టి భార్య..
ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు పై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఖమ్మంలో (Khammam) పది స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది కాంగ్రెస్. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సతీమణి మల్లు నందినికి (Bhatti Nandhini) ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖమ్మం ఎంపీ స్థానం కోసం మల్లు నందిని పేరిట దరఖాస్తు వచ్చింది. మల్లు నందిని తరపున గాంధీభవన్‌లో దరఖాస్తు చేశారు ఖమ్మం డీసీసీ చీఫ్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, కాంగ్రెస్ నేతలు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలనుందని గతంలోనే నందిని చెప్పారు.
రేసులో సోనియా గాంధీ?..
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే.. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ దేశ రాజకీయాల్లో మొదలైంది. గతంలో ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ బరిలో సోనియాగాంధీ ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి. ఖమ్మంలో బీజేపీకి డిపాజిట్లు లేవు.. అలాగే తెలంగాణ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బీఆర్‌ఎస్ పార్టీ కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉంది. అలాగే కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు అని వామపక్షాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సోదరుడు ప్రసాద్ రెడ్డి ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన
DO WATCH: