Dalit Bandhu Scheme: గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాల్లో దళితబంధు (Dalit Bandhu) ఒకటి. అయితే.. తొలివిడతలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా వారి ఖాతాల్లోనూ డబ్బులు జమ చేసింది. అయితే.. రెండో విడత పంపిణీ పూర్తి కాకముందే ఎన్నికలు వచ్చాయి. తర్వాత ప్రభుత్వం (Congress Government) మారిపోయింది. అయితే.. రెండో విడత కింద గత ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను సైతం పూర్తి చేసింది. కానీ వారికి డబ్బులు అందించడం మాత్రం పెండింగ్ లో ఉంది. అయితే.. వీరి పరిస్థితి ఇప్పుడు ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. లబ్ధిదారులు సైతం ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: KTR: నిరుద్యోగ భృతి లేదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్, కడియం ఫైర్!
అయితే.. దళితబంధుపై ఎస్సీ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో విడతలో తీసుకున్న దరఖాస్తుల పరిశీలన నిలిపివేసింది. దాదాపు 50వేల దరఖాస్తులపై విధానపరమైన స్పష్టత కోసం ఎదురు చూస్తోంది. స్పష్టత వచ్చేవరకు దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిట్లు మంజూరై, కొంత నగదు విడుదలైన వారికి మిగతా సాయం అందించాలా? లేదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమశాఖ లేఖ లేఖ రాసింది.
దీనిపై రేవంత్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అశంపై ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వం వారి కార్యకర్తలు, మద్దతుదారులకే దళితబంధు సాయం అందించి.. అసలు లబ్ధిదారులను వదిలేసిందన్న ఆరోపణలను గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు ఆ పార్టే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక మళ్లీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. కేసీఆర్ హయాంలో మొదటి విడతలో 38,323 కుటుంబాలకు దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయి.