Six Guarantees: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరు గ్యారెంటీలపై అప్డేట్

ఆరు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు.

New Update
Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారెంటీల అమలుపై అప్డేట్ ఇచ్చారు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 28నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదిహేను రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభల్లో ఆరు గ్యారెంటీల అమలుకు అప్లికేషన్లు, ఇతర గ్రీవెన్స్ను అడ్రస్ చేస్తామన్నారు.

ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరు గ్యారేటీలపై అప్డేట్

అలాగే నిన్న (సోమవారం) జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ టికెట్ కేటాయింపు, పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం వంటి విషయాలపై ఆయన కామెంట్స్ చేశారు. ఈ రోజు( సమావేశం జరిగిన రోజు నుంచే) అర్హుల ఎంపిక ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు అతి త్వరలో ప్రభుత్వం మార్గదర్శ కాలు విడుదల చేస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు. త్వరలోనే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల ఎంపిక జరుగుతుందన్నారు. నాగ్ పూర్ లో ఈనెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలి పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పై అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఏఐసీసీ సభ్యులు సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ఎంపీ టికెట్లు పీసీసీ ఎమ్మెల్సీలన్నీ అధిష్టానం పరిధిలో ఉన్నాయన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

ALSO READ: పార్లమెంట్ ఎన్నికలు.. నేడు ఇండియా కూటమి భేటీ

Advertisment
తాజా కథనాలు