MLC Jeevan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్(CM KCR) పాలనంతా అవినీతిమయం అని ఆరోపించారు. అంతేకాదు.. కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్టు స్పాట్‌గా మారుతుందని గతంలోనే చెప్పానని అన్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే తాను అన్న మాట నిజమైందన్నారు. కుంగిపోతున్న ప్రాజెక్టును చూసేందుకు అందరూ వస్తున్నారని అన్నారు. గోదావరి వదర ప్రవాహం వస్తే ఇసుక తరలి పోతుందనే కనీస పరిజ్ఞానం కేసీఆర్‌కు లేదని విమర్శించారు.
ఇదే సమయంలో ప్రాజెక్టు ఇంజనీర్లపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రాజెక్టు కోసం నిర్మించిన పిల్లర్ల కింద బొగ్గు గనులు ఉన్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. 'దొరగారు సంతకం పెట్టమంటే ఇంజనీరింగ్ ఆఫీసర్లు సంతకం పెట్టారు. సాంకేతికపరమైన అంశాలను ఏమాత్రం పరిశీలించకుండా కాళేశ్వరంను డిజైన్ చేశారు.' అని ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు. సాంకేతికంగా పరిశీలించకుండా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసినందుకు ఈఎన్సీ మురళీధర్ రావును జైల్లో వేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ అవినీతికి సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ తిన్న సొమ్ము అంతా కక్కిస్తామన్నారు.
కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్..
కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీకి నిలబడితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొట్ట మొదటి స్థానం కామారెడ్డియే అని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 'కేసీఆర్‌ను ఓడగొట్టే మొగోడు రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను ఓడగొట్టాలని ప్రజలందరూ కసితో ఉన్నారు. కామారెడ్డి ప్రభావం రాష్ట్రమంతా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.' అని అన్నారు జీవన్ రెడ్డి.
Also Read:
ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!