తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన ఎమ్మెల్యే సీతక్క

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యే సీతక్క బాయ్ కాట్ చేశారు. సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో.. నిరసన వ్యక్తం చేస్తూ సీతక్క బాయ్ కాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. జీరో అవర్ లో కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని అంటున్నా.. అవకాశం ఇవ్వకపోతే మరి అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని కేసీఆర్ ప్రభుత్వాన్ని..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన ఎమ్మెల్యే సీతక్క
New Update

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యే సీతక్క బాయ్ కాట్ చేశారు. సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో.. నిరసన వ్యక్తం చేస్తూ సీతక్క బాయ్ కాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. జీరో అవర్ లో కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని అంటున్నా.. అవకాశం ఇవ్వకపోతే మరి అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీతక్క.

సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా.. వారి మైక్ లను కట్ చేయరు కానీ.. తాము ఒక్క నిమిషం ఎక్స్ ట్రా మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో అధికార పార్టీ నేతలు అసత్యాలే మాట్లాడుతున్నారని సీతక్క ఆరోపించారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్ ‌లు ఎందుకు పెట్టుకుంటున్నారని అడిగారు.

ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుందని ధ్వజమెత్తారు సీతక్క. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ళ ప్రగతి గురించి చర్చ ఎలా చేపడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్ ‌లో ఎందుకు అవకాశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సభ నిర్వాహణ తీరు తమ లాంటి వారికి బాధ కలిగిస్తోందని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు అసెంబ్లీ ఎదురుగా రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అసెంబ్లీని ముట్టడించడానికి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) నేతలు, విద్యార్థులు ప్రయత్నించారు. దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగి అసెంబ్లీ వద్దకు వచ్చి లోనికి చేరుకొనే ప్రయత్నం చేశారు. దీంతో అసెంబ్లీ పరిసరాలు, ముందరి ప్రాంగణం ఉద్రిక్తతంగా మారింది. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనం ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

#telangana #mla-seethakka-boycotts-ts-assembly #assembly #congress-mla-seethakka #seethakka #ts-assembly
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి