MLA Madhav Reddy : కాంగ్రెస్‌కు షాక్.. ఎమ్మెల్యే రాజీనామా?

TG: వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్‌కు షాక్ ఇచ్చారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. సీఎం టూర్‌కు ఆయన డుమ్మా కొట్టారు. అలాగే సమీక్ష సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

New Update
MLA Madhav Reddy : కాంగ్రెస్‌కు షాక్.. ఎమ్మెల్యే రాజీనామా?

Shock To Congress - MLA Madhav Reddy Resign : శనివారం వరంగల్‌ (Warangal) లో పర్యటించారు సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy). సీఎం టూర్‌కు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి డుమ్మా కొట్టారు. సీఎం పర్యటనకు ఎమ్మెల్యే దొంతి రాకపోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. నర్సంపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు దొంతి. కాగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి కూడా ఎమ్మెల్యే హాజరుకాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని దొంతి పార్టీపై అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ను ఇప్పటివరకూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలవలేదు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.

Also Read : రెండు రోజుల్లో నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు